world famous lover vijay devarakonda డబ్బింగ్ కార్యక్రమాల్లో వరల్డ్ ఫేమస్ లవర్
సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్
. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుగుతుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: క్రాంతి మాధవ్
నిర్మాత: కె.ఎ.వల్లభ
సమర్పణ: కె.ఎస్.రామారావు
సంగీతం: గోపీ సుందర్
కెమెరా: జయకృష్ణ గుమ్మడి
ఆర్ట్: సాహి సురేశ్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్