“భస్మాసురుడు అని ఒకడుండేవాడు తెలుసా.. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవ్వడికి ఛాన్స్ ఇవ్వడు” అనే పవన్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్.. ప్రతీదానికి ‘టైమ్ లేదు’ అంటూ హడావిడి చేసేసే సాయితేజ్ విజువల్స్ తో ముందుకు సాగింది. సాయితేజ్ సూసైడ్ ఎటెంప్ట్ తరువాత టైమ్ కి మానవ రూపంగా పవన్ కళ్యాణ్ పరిచయమవడం.. ఆపై కొన్ని సరదా విన్యాసాలు చూపించడం జరిగింది. అలాగే “అందరూ టైమ్ లో ముందుకు వెళుతుంటారు.. నువ్వొక్కడివే వెనక్కి వెళ్తున్నావ్” అంటూ సాయితేజ్ తో పవన్ చెప్పే మాట.. ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆపై సాయితేజ్ కార్ యాక్సిడెంట్ చూపడం.. “చచ్చి బతికానన్నమాట. అనవరసంగా బతికి చచ్చాను” అంటూ సాయి తేజ్ డైలాగ్ చెప్పడం.. ఆనక కొన్ని ఎమోషనల్ సీన్స్ తాలూకు విజువల్స్.. చివర్లో పవన్ ఫన్నీ డైలాగ్స్ తో ‘జల్సా’ టచ్ ఇవ్వడం మురిపిస్తుంది. మధ్యలో.. కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా తళుక్కున కనిపించారు. ఓవరాల్ గా.. ‘టైమ్’తో మార్కండేయ ప్రయాణం ఎలా సాగిందన్నదే ‘బ్రో’ సినిమా అని ట్రైలర్ తో చెప్పకనే చెప్పేశారు.