టీడీపీ లో ‘జనసేన ‘ టెన్షన్ ! పవన్ అస్సలు తగ్గట్లే 

Date:


జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సరికొత్తగా రాజకీయం మొదలుపెట్టారు.వారాహి యాత్ర ద్వారా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడంతో పాటు , జనసేన అధికారంలోకి రాబోతోంది అనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తూ,  తద్వారా పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు .

 Pawan Kalyan Finalizing The In-charges Of Constituencies And The Candidates On-TeluguStop.com

అయితే ఈ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది.ఇటీవల కాలంలో వైసిపి లోని కీలక నేతలు చాలామంది జనసేనలో చేరారు.

మరి కొంతమంది చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు.క్రమక్రమంగా చేరికలతో రాష్ట్రవ్యాప్తంగా బలమైన పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగానే ప్రచారం జరుగుతుంది.

Telugu Ap, Janasena, Janasenabjp, Janasenani, Pavan Kalyan, Telugudesam, Varahi,

 ఒకపక్క బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే,  టిడిపి( TDP ) విషయంలో సానుకూలంగా ఉండడంతో,  పొత్తులతోనే మూడు పార్టీలు వైసీపీని ఎదుర్కోబోతున్నాయనే విషయం అందరికీ అర్థమైంది.అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.టిడిపి ,జనసేన ఏ ఏ నియోజకవర్గాలను పంచుకుంటున్నాయి అనేది క్లారిటీ రాకుండానే పవన్ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమిస్తుండడం,  కొంతమందికి సీట్లు కన్ఫామ్ చేస్తుండడం టిడిపికి ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటికే కొవ్వూరు, రాజానగరం, పిఠాపురం నియోజకవర్గలకు ఇన్చార్జీలను నియమించారు.ఇటీవలే వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్( Panchakarla Ramesh Babu ) వైసిపికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు.

ఆయన జనసేన లో చేరేందుకు సిద్ధమయ్యారు .ఆయనకు పెందుర్తి అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం.ఆ హామీతోనే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో పంచకర్ల చేరబోతున్నారట.అలాగే వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలు చేరారు.

Telugu Ap, Janasena, Janasenabjp, Janasenani, Pavan Kalyan, Telugudesam, Varahi,

 ఆయనకు చీరల టికెట్ ఇవ్వబోతున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.ఇక మాజీ మంత్రి సీనియర్ పొలిటిషన్ డిఎల్ రవీంద్రారెడ్డి జనసేనలో చేరేందుకు ఆసక్తితో ఉన్నారట.గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన డిఎల్ కడప జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు.గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేశారు.ఆ తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు.ఇటీవల టిడిపిలో చేరాలని డీఎల్ ప్రయత్నించినా , ఆయన ఆశిస్తున్న మైదుకూరు నియోజకవర్గ టికెట్ ను పుట్టా సుధాకర్ యాదవ్ కు కేటాయించబోతున్నారనే సమాచారంతో డిఎల్ జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా కీలక నేతలంతా ఇప్పుడు జనసేన లో చేరే అవకాశం ఉండడం తో , టీడీపీ ఎక్కువ కంగారు పడుతుంది.జనసేన, టిడిపి మధ్య పొత్తు ఒక క్లారిటీకి రాకపోయినా, పవన్ నియోజకవర్గ ఇన్చార్జీలను, పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేస్తుండడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ పరిణామాలన్ని లెక్క వేసుకుని జనసేన ఎన్నికల నాటికి తమతో పొత్తు పెట్టుకుంతుందా, లేక బిజెపి నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గుతుందా అనే విషయంపైనే టిడిపి నేతల్లో ఎక్కువ కంగారు కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...