టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ సంచలనమే

Date:


ఆ సినిమా లాగే డివైడ్ టాక్ సినిమా మీద పెద్దగా ప్రభావం చూపేలా కనిపించడం లేదు. యుఎస్‌లో ప్రిమియర్స్ నుంచి ఈ సినిమా లక్ష డాలర్లకు పైగా కలెక్ట్ చేయడం సెన్సేషన్ అనే చెప్పాలి. వీకెండ్ అంతా కూడా ‘బేబి’ వసూళ్ల మోత మోగించేలా కనిపిస్తోంది. ఆ లోపే బయ్యర్లందరూ కూడా బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా ఫుల్ రన్లో రూ.15 కోట్ల షేర్ రేంజికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐతే టాక్ తొలి రోజు సినిమా వసూళ్ల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపేలా కనిపించడం లేదు. ఈ ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బేబి’ థియేటర్లు జనాలతో కళకళలాడాయి. యూత్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. సింగిల్ స్క్రీన్లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి. ఇంతకుముందు ‘ఆర్ఎక్స్ 100’ సినిమా కోసం ఎలాగైతే ఎగబడ్డారో అలాగే ఈ చిన్న సినిమా కోసం కూడా యువ ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు.

గురువారం రాత్రి ఐమాక్స్‌లో సందడి చూస్తే.. ఎవరైనా పెద్ద హీరో సినిమా రిలీజైందా అన్న సందేహాలు కలిగాయి. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి రెండున్నర వరకు ‘బేబి’ సందడి కొనసాగింది. ప్రిమియర్స్ నుంచి సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. ఐతే ఉదయం మార్నింగ్ షోలకు టాక్ మిక్స్‌డ్‌గా వచ్చింది. సమీక్షలు కూడా కొంచెం అటు ఇటుగానే వచ్చాయి.

అనుకున్నట్లే ‘బేబి’ అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపేలా కనిపిస్తోంది. అదిరిపోయే పాటలు.. చక్కటి ప్రోమోలతో యువ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. రిలీజ్ ముందు రోజు, గురువారం పెయిడ్ ప్రిమియర్స్ నుంచి అదిరిపోయే స్పందన తెచ్చుకుంది. హైదరాబాద్ సిటీలో దాదాపు 20 షోలు వేస్తే.. అన్నిటికీ ఫుల్స్ పడిపోవడం విశేషం. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒక్కదాంట్లోనే ఏడెనిమిది షోలు పడ్డాయి. అన్నింటికీ హాళ్లు నిండిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

నిన్న కృతి, నేడు శ్రీలీల.. మూన్నాళ్ళ ముచ్చటేనా!

'పెళ్లి సందడి'తో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల 'ధమాకా'తో బ్లాక్...

బన్నీ కన్నా ముందు త్రివిక్రమ్ మరో సినిమా?

డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి...

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....