‘జైలర్’ దర్శకుడి ఆత్మహత్య ఆలోచనలు

Date:


తన సినిమాకు రూ.5 కోట్ల ఖర్చయిందని.. తన దగ్గరున్న డబ్బుతో పాటు ఆస్తులు, బంగారం అమ్మి దీని మీద పెట్టుబడి పెట్టానని.. సినిమాను పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని.. తన జీవితమే ఈ సినిమా మీద ఆధారపడి ఉందని అతనన్నాడు. ఈ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయని.. రజినీ చాలా మంచి వారని.. ఆయన తన పరిస్థితిని గుర్తించి కేరళ వరకు టైటిల్ మార్చి రిలీజ్ చేయాలని అతను కోరాడు. మరి రజినీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.

రజినీ సినిమా, తన చిత్రం ఒకే టైటిల్‌తో రిలీజైతే తనకు తీవ్ర ఇబ్బంది తప్పదంటూ షకీర్ మడత్తిల్ కొన్ని రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి.. రజినీ సినిమాకు టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం అతను కోర్టును కూడా ఆశ్రయించాడు. ఆగస్టు 22న ఈ కేసును మద్రాస్ హైకోర్టు విచారించనుంది. ఐతే ఈ లోపు రజినీ సినిమా టీంకు షకీర్ ఒక విజ్ఞప్తి చేశాడు. కనీసం కేరళ వరకు అయినా రజినీ సినిమాకు టైటిల్ మార్చి రిలీజ్ చేయాలని కోరాడు.

అంత‌కు కొన్ని నెల‌ల ముందే అత‌ను జైల‌ర్ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల ఆలస్యమై వచ్చే నెల 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. అదే రోజు రజినీ సినిమా ‘జైలర్’ కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అది మలయాళ చిత్రం, ఇది తమిళ సినిమా కాబబట్టి ఇబ్బందేమీ లేదు అనుకోవడానికి లేదు. త‌మిళ సినిమాలు కేర‌ళ‌లో పెద్ద స్థాయిలో రిలీజ‌వుతాయి. ర‌జినీ సినిమాల‌కు అక్క‌డ డిమాండ్ ఎక్కువే.

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేసిన దర్శకుడికి అంత కష్టం ఏం వచ్చింది అనిపిస్తోందా ఈ హెడ్డింగ్ చూసి. కానీ ఇక్కడ మాట్లాడుతోంది రజినీ సినిమా ‘జైలర్’ తీసిన దర్శకుడి గురించి కాదు. మలయాళంలో ‘జైలర్’ పేరుతోనే వేరే సినిమా తీసిన షకీర్ మడత్తిల్ గురించి. అతను 2021 న‌వంబ‌రులోనే ‘జైలర్’ పేరుతో మలయాళంలో ఓ సినిమా మొద‌లుపెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...

సౌందర్య శోభనను మర్చిపోతే ఎలా

దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత...

శ్రీలీల సెలవుపై రామ్ పేలిపోయే కామెంట్

రామ్ ఎంత సరదాగా అన్నా అందులో నిజం లేకపోలేదు. శ్రీలీల...

చంద్రముఖి 2 అసలు ట్విస్టు చెప్పేశారు

ప్రస్తుతానికి బజ్ పెద్దగా లేకపోయినా చేతిలో ఉన్న అయిదు రోజుల్లో...