జాతీయ స్థాయి పేద క్రీడాకారిణికి ఆర్థిక సహాయం
శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్దపాడు గ్రామంలో , ఉన్నత పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న కోరాడ శారద గత నెల రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో బాలికల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించింద. అయితే ఈమె ఈనెల నవంబర్ 17వ తారీఖున ఢిల్లీలో జాతీయ స్థాయి కుస్తీ పోటీలో పాల్గొంది, ఈ క్రీడాకారుని వారి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనం కావడంతో , ఈ క్రీడాకారునికి మూడువేల రూపాయలు విలువగల ట్రాక్ షూట్ , బూట్లు, కుస్తీ పోటి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దుస్తులు హైదరాబాదులో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ గా కళాశాలలో పనిచేస్తున్న పాత శ్రీకాకుళం పట్టణానికి చెందిన వేణుగోపాలరావు , పెద్దపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినా మక్కా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు ఈ క్రీడాకారునికి పంపిణీ చేశారు దీంతో ఆమె కుటుంబ సభ్యులు , ఇతనికి ఈ ప్రొఫెసర్ వేణుగోపాలరావు కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో అన్ని రంగాల్లో ప్రత్యేక నైపుణ్యత గల విద్యార్థిని విద్యార్థులకు ఎప్పుడు కూడా తమ సొంత డబ్బులతోనే,
మిత్రుల, ఇతరులు ప్రోత్సాహంతో విద్యార్థులకు అనేక రంగాల్లో ప్రోత్సహిస్తామని, ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అయినా పి.సత్యవతి, ఎం శాంతారావు, ఎస్ వి కృష్ణారావు, జి భూషణ రావు, డి.ఎం. మల్లేశ్వరి, కే సురేష్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు గుండ బాల మోహన్, క్రాఫ్ట్ బి . త్రివేణి, ఆర్ట్ సి.హెచ్. రవికుమార్ , అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.