“కన్నెఅదిరింది పైటే చెదిరిందికాలే నిలవదు పిలగా నిన్నటికెళ్లి గమ్మతుగుంది..“
అంటూ సింగర్ మంగ్లీ తనదైన స్టైల్లో పాడిన పాటను `రాబర్ట్` చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కథానాయకుడిగా ఉమాపతి ఫిలింస్ బ్యానర్‌పై తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వంలో ఉమాపతి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాబర్ట్‌స. మార్చి 11న ఈ సినిమాను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. అర్జున్ జన్యా సంగీతం అందించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియెన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రాబర్ట్ సందడికి సిద్ధమయ్యాడు హీరో దర్శన్.
నటీనటులు: దర్శన్, జగపతిబాబు, రవికిషన్, ఆశా భట్, దేవ్‌రాజ్, రవిశంకర్ తదితరులు
సాంకేతిక వర్గం: రచన, దర్శకత్వం: తరుణ్ కిషోర్ సుధీర్‌నిర్మాత: ఉమాపతి శ్రీనివాస్ గౌడసంగీతం: అర్జున్ జన్యాసినిమాటోగ్రఫీ: సుధాకర్ ఎస్.రాజ్‌ప్రొడక్షన్ డిజైన్: మోహన్ బి.కేరేఎడిటర్: కె.ఎం.ప్రకాశ్‌డైలాగ్స్: హనుమాన్ చౌదరిపాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, కాసర్లశ్యామ్‌యాక్షన్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు, వినోద్‌ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దర్శన్ ఎస్, చిరాగ్