ఇటీవలే కాలంలో చాలామంది క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి.రోజురోజుకు మనిషిలో ఓపిక, సహనం నశించిపోతోంది.
మనిషిలో ఉండే పోటీతత్వం గొడవలకు దారితీసి దారుణాలకు కారణం అవుతుంది.కుటుంబ సభ్యుల పైనే పగ, ప్రతికారాలు పెంచుకొని చంపుకుంటున్నారు.
ఇలాంటి కోవలోనే క్షణికావేశంలో సొంత తమ్ముడినే చంపేశాడు ఓ అన్న.ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందో చూద్దాం.వరాల్లోకెళితే.
కాకినాడ జిల్లా( Kakinada District ) పెద్దాపురం మండలం కట్టమూరులో అబ్బులు, వంశీ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.ఇద్దరూ కలిసి చేపలు పట్టేందుకు చెరువు దగ్గరకు వెళ్లారు.
చేపలు పట్టడం మొదలుపెట్టిన కాసేపటికి ఇద్దరి మధ్య చిన్న వివాదం రేగింది.ఆ వివాదం క్రమంగా పెరగడంతో కోపాద్రిక్తుడైన తనను తాను కంట్రోల్ చేసుకోలేక తమ్ముడు అబ్బులను చెరువులో తోసేశాడు.
అబ్బులు నీటిలో మునిగి, ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడు.అనంతరం వంశీ భయంతో ఏం చేయాలో తెలియక తమ్ముడు చనిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాడు.

అయితే కుటుంబ సభ్యులు అబ్బులు కనిపించకపోవడంతో గ్రామమంతా గాలించారు.తెలిసిన వారందరినీ అబ్బులు కనిపించాడా అని ఆరా తీశారు.అయినా కూడా అబ్బులు ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు గ్రామస్తులతో విచారించగా అబ్బులు చివరగా చెరువు దగ్గరకు వెళ్ళాడు అనే సమాచారం తెలియడంతో.చెరువు చుట్టుపక్కల ప్రాంతాలను గాలించి, చెరువులో వెతికారు.అబ్బులు మృతదేహం చెరువులో కనిపించింది.
అబ్బులు మృతదేహాన్ని బయటకు తీశారు.అయితే అబ్బులు తన అన్న వంశీ( Vamsi)తో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళినట్టు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసు( Police )లు వంశీని అదుపులోకి తీసుకొని విచారించారు.
వంశీ చెరువు దగ్గర జరిగిన మొత్తం సంఘటన పోలీసులకు తెలిపి తన నేరాన్ని అంగీకరించాడు.ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఒక్కసారిగా ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
