పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి( Baahubali ) సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో నిర్మాతలు క్యూ కడుతూ భారీ సినిమాలను ప్రకటించారు.
అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోలేక పోయాడు.ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది.
ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.మరి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది.ఈ సినిమా ప్రభాస్ మిగిలిన ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయిన కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
హారర్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేస్తున్నట్టు టాక్.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందట.యాక్షన్ జోనర్ లో ఈ సినిమా కథ నడిచిన హారర్ కామెడీ అద్భుతంగా ఉంటుందట.
బుజ్జిగాడు వంటి సినిమా తర్వాత ప్రభాస్ ఎంచుకునే సినిమాలన్నీ సీరియస్ జోనర్ లోనే తెరకెక్కుతున్నాయి.కానీ ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ జోవియల్ రోల్ లో కనిపిస్తాడట.
అందుకే ప్రభాస్ కూడా ఈ సినిమాను చేయడానికి ఇష్ట పడుతున్నాడు అని తెలుస్తుంది.

ఇక ‘రాజా డీలక్స్( Raja Deluxe )’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాయల్, అంబాసిడర్ అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు అని మేకర్స్ మాత్రం రాయల్ అనే టైటిల్ కే మొగ్గు చూపిస్తున్నారు అని టాక్.అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్టు న్యూస్ వినిపిస్తుంది.కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
