ఇటీవలే వివాహేతర సంబంధాలన్నీ చివరికి తీవ్ర విషాదంగా ముగుస్తున్నాయి.కేవలం కొద్ది క్షణాల శారీరక సుఖం కోసం మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తీసుకునే నిర్ణయాల వల్ల చివరికి తానే బలి అవుతున్నాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఓ వ్యక్తి కు వివాహితతో పరిచయం చివరికి అక్రమ సంబంధానికి దారితీసింది.అయితే ఆ వివాహితకు ఒక కుమారుడు ఉండడం వల్ల ఆ వ్యక్తి తన ప్రియురాలను తరచూ కలుసుకునేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఆ అడ్డుగా ఉన్న ప్రియురాలి కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రిలో( Chagalamarri of Nandyala District ) చోటు చేసుకుంది.
ఆ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.చాగలమర్రి కి చెందిన లక్ష్మణ్( Lakshman ) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది.ఆ వివాహితకు సాయి అనే కుమారుడు ఉన్నాడు.
షాహిద్( Shahid ) కారణంగా లక్ష్మణ్ కు తన ప్రియురాలును తరచూ కలవడం వీలు అయ్యేది కాదు.షాహిద్ అడ్డుగా లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రియురాలితో ఎంజాయ్ చేయవచ్చు అని భావించిన లక్ష్మణ్ షాహిద్ ను అడ్డు తొలగించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.

పైగా షాహిద్ పుట్టు మూగ, మాటలు రావు కాబట్టి హత్య చేయడం కాస్త సులువే అని అనుకున్నాడు.ఇక అవకాశం కోసం ఎదురు చూసిన లక్ష్మణ్ సోమవారం సాయంత్రం దారుణంగా కొట్టి హత్య చేశాడు.సాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాగలమర్రి పోలీసులు లక్ష్మన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ వార్త తెలియడంతో చాగలమర్రిలో తీవ్ర విషాదం నెలకొంది.
