5.1 C
New York
Saturday, June 3, 2023
HomeNewsAndhrapradeshచరిత్ర చెప్పని ఓ మహోన్నత విప్లవ నాయకుడు జార్జ్ రెడ్డి గురించి తెలుసుకుందాం_Ts360News

చరిత్ర చెప్పని ఓ మహోన్నత విప్లవ నాయకుడు జార్జ్ రెడ్డి గురించి తెలుసుకుందాం_Ts360News

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

చరిత్ర చెప్పని ఓ మహోన్నత విప్లవ నాయకుడు జార్జ్ రెడ్డి గురించి తెలుసుకుందాం…


కొన్ని దుష్ట శక్తులు 60 కత్తి పోట్లు తో పొడిచి పొడిచి చరిత్ర నుంచి తప్పించి వేసిన ఆ విద్యార్థి నాయకుడు పేరు ” జార్జ్ రెడ్డి ” ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ విద్యార్డులు ముద్దుగా జూనియర్ సైంటిస్ట్ అని పిలుచుకునేవారు ..యూనివర్సిటీ లో ఆడపిల్లలు పై జరిగే లైంగిక దాడులను ,అట్టడుగు వర్గాలు ,దళితులు ,పేద విదార్దులపై జరిగే అరాచకాలను ముందుండి ప్రశ్నించాడు, అరాచక శక్తుల పాలిట బొబ్బిలి పులి అయ్యాడు ..ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఎదురించాడు.. అందుకే విద్యార్డులు జార్జ్ ను జూనియర్ చేగువేరా అని పిలుచుకునేవారు ..

ఏమో కాలం కలిసొస్తే భారతదేశానికి ఓ ఐనస్టీన్ నోబెల్ ప్రైజ్ అందుకునేవాడేమో ,భారత్ నుండి ఓ చేగువేరా ప్రధాన మంత్రి అయ్యేవాడేమో …కానీ పట్టు మని 25 ఏళ్ళ లేత ప్రాయంలోనే ఉస్మానియా నడిరోడ్డు పై దారుణ హత్యకు గురవుతాడని ఎవరు మాత్రం అనుకున్నారు .ఈయన 1947, జనవరి 15 న కేరళలో పాల్ఘాట్ లో జన్మించారు చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రావెన్కూరు ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకుజన్మించారు . ఈయన తల్లితండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కలుసుకున్నారు రఘునాథరెడ్డి బి.ఏ హానర్స్ చేయగా, లీలా వర్గీన్ రసాయనశాస్త్రం లో డిగ్రీ పూర్తిచేసి, ఎం.ఏ చదివింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దవాడైన డాన్ రెడ్డి బి.ఈడీ పూర్తిచేసి, ఒరిస్సాలో స్థిరపడ్డాడు. రెండవ కొడుకు కార్ల్ రెడ్డి ఐ.ఏ.ఎస్ అధికారి అయ్యాడు. కుమార్తె జాయ్ రెడ్డి, భాషాశాస్త్రంలో ఎం.ఏ చేసి మైసూరులోని భారతీయ భాషా అధ్యయన కేంద్రంలో పనిచేసింది. నాలుగవ సంతానం జార్జి రెడ్డి, చివరి వాడు సిరిల్ రెడ్డి. జార్జ్ రెడ్డి పేరుతో నల్గొండ జిల్లాలో జాజిరెడ్డిగూడెం వచ్చింది.

జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బెంగుళూరు మరియు చెన్నైలలో సాగింది. ఐదు, ఆరు, ఏడు తరగతులు క్విలాన్ జిల్లా తంగచ్చేరిలోని ఇన్‌ఫెంట్ జీసస్ ఉన్నత పాఠశాలలో, ఎనిమిది, తొమ్మిది తరగతులు చెన్నై ఎగ్మోరులోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ తరువాత 1961-62లో కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ ఉన్నత పాఠశాలలో కొన్నాళ్ళు చదివాడు. ఆ తరువాత కుటుంబం హైదరాబాదుకు మారింది. అక్కడ సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. నిజాం కళాశాలలో పీ.యూ.సీ (ఇప్పటి ఇంటర్మీడియట్ తో సమానం) పూర్తి చేశాడు. 1964లో బీ.ఎస్సీ చేయటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయపు సైన్సు కళాశాలలో చేరాడు. కానీ డిగ్రీ 2, 3వ సంవత్సరాలు మాత్రం నిజాం కళాశాలలో పూర్తిచేశాడు.

హైదరాబాదులోని నిజాం కళాశాలలో బియస్సీ (1964-67) డిగ్రీ చేశారు.1967 లో MSc చెయ్యటానికి ఉస్మానియా యూనివర్సిటీ తలుపు తట్టాడు ..అప్పుడా యూనివర్సిటీ కేమి తెలుసు ఉస్మానియా చరిత్రను తిరగరాసే మరో విప్లవ యోధుడు క్యాంపస్ లోకి పాదం మోపాడని,సన్నని బక్కచిక్కిన శరీరం ,అయోమయం తో అమాయక చూపులు జార్జ్ ని చూసినవారు ఎవరు కూడా ఫ్యూచర్ లో ఆ కుర్రాడు అరాచక శక్తులు పై పంజా విసిరే బొబ్బిలి పులిగా మారతాడని అనుకుని ఉండరు .జార్జ్ కి ఉస్మానియా లో చదివే రోజుల్లో రెండే పేవరెట్ స్పాట్ లు ఒకటి ఒకటి సెంట్రల్ లైబరీ ,రెండు జిమ్ .గ్రంధాలయం లో సబ్జెక్టు కి సంపాందించిన బుక్స్ తో పాటు చేగువేరా ,భగత్ సింగ్ లాటి ఎందరో విప్లవ కారులు బయో గ్రఫీ లు చదివాడు హేగెల్, మార్క్స్ మరియు ఫ్రాయిడ్ రచనలను చదివాడు .ముఖ్యం గా చేగువేరా జీవిత చరిత్ర జార్జ్ ని ఎంత గానో ప్రభావితం చేసింది .చిన్న నాటి రోజుల్లో అయన తల్లి ధైర్యం నూరిపోసింది పెద్దయ్యాక సమకాలీన జాతీయ ,అంతర్జాతీయ అంశాలను క్షుణ్ణం గా చదివి అవగాహన పెంచుకున్నాడు ..సమాజాన్ని ఎదురించే ధైర్యం లైబ్రరీ లో ఆ మహనీయులు పుస్తకాలూ నుంచి వచ్చింది ..మరో వైపు జార్జ్ పీహెచ్డీ కోసం యూనివర్సిటీ లో దరఖాస్తు చేసుకున్నాడు ..అపారమైన మేధస్సు గల జార్జ్ రెడ్డి కి గైడ్ గా ఉండటానికి ఏ ఒక్క ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కి చెందిన ఏ ప్రొఫిసర్ కూడా ముందుకు రాలేదు ..చివరికి ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ కి చెందిన ప్రొఫెస్సర్ జార్జ్ కి తన దగ్గర పీహెచ్డీ చెయ్యటానికి అవకాశం ఇచ్చాడు .ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూ పాక్షిక సమయంలో కొన్ని నెలల పాటు ఏ.వి.కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేశారు. పీహెచ్డీకి అనుమతి పొందారు. జార్జి రెడ్డి బాక్సింగ్ చేసేవాడు. తీవ్ర పఠనాసక్తి కలవాడు. తాను చదువుకుంటూ కూడా తన సహా పేద విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు .ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ లో గుండా యిజం ,రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది …కొందరు అల్లరు మూకలు అమ్మాయిలను రాగింగ్ చేసి వంటింట్లో వంట చేసుకునే నీకెందుకే ఉన్నత చదువులు అని అవమాన పరిచేవారు ..అట్టడుగు బలహీన వర్గాలు దళితులు పిల్లలను మీరంతా చదువుకుని ఉన్నత స్థానాలలోకి వెళితే మా బట్టలు ఎవరు ఉతుకుతారు మా గెడ్డమేవారు తీస్తారు అంటూ మానవత్వం సిగ్గుతో తలదించుకునేలా కించపరిచేవారు ..ఈ అల్లరి మూకలు వెనుక పెద్ద పెద్ద భూస్వాములు ,బడా బడా రాజకీయనాయకులు అండ దండలు ఉండటం తో ప్రొపెసర్ లు ,పోలీస్ లు కూడా వారి అరాచకాలను చూసి చూడనట్టు వదిలేసేవారు ..జార్జ్ రెడ్డి యూనివర్సిటీ లో జరుగుతున్నా అన్యాయాలను ,అరాచకాలను చూస్తూ లోలోపల రగిలిపోయేవాడు ..ఈ అరాచకాలను ఎదిరించాలంటే విప్లవ విద్యార్థి నిర్మాణం ఒక్కటే మార్గమని జార్జ్ భావించాడు ..జార్జ్ రెడ్డి విద్యార్థి విప్లవ నిర్మాణం వైపు ఆలోచింపచేయటానికి ఆ రోజు మూడు ప్రధాన అంతర్జాతీయ సంఘటనలు పురిగొల్పాయి ..ఒకటి చేగువేరా విప్లవ జీవితం .చేగువేరా క్యూబా విప్లవ పోరాటాన్ని నడిపించిన తీరు ,గెరిల్లా వార్ ఫైట్ స్టాటజీస్ జార్జ్ ను ఎంతగానో ప్రభావితం చేసాయి ..రెండవది పెట్టుబడి దారి విధానం ,వినిమయ తత్త్వం ,అమెరికన్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకం గా , 1968 లో ప్రెంచ్ విద్యార్థుల నుంచి ఉవ్వెతున ఎగసిన విప్లవ పోరాటం .విద్యార్థుల ఆందోళనలతో రెండు నెలలు పాటు ప్రాన్స్అట్టుడిగి పోయింది ..విద్యార్థి శక్తి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం ఈ సంఘటనలు తరవాతే వచ్చింది ..మూడవది వియత్నం విప్లవ పోరాటం పిల్లి కూన వంటి ఒక చిన్న దేశమైన వియత్నం సింహం లా గర్జించి ప్రాణాలకు తెగించి పోరాడి ,బలశాలి అయినా అమెరికాను ఓడించిన విధానం జార్జ్ లో కొత్త ఆశలు చిగురింప చేసింది ..మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఎంతటి బలవంతమైన వ్యవస్థను కూడా కూకటి వేళ్ళ తో సహా పెకిలించవేయవచ్చని అనే నమ్మకం కలిగింది ..శ్రీకాకుళం ,గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు కూడా జార్జ్ ను ఎంతగానో ప్రభావితం చేసాయి ..జార్జ్ నిజానికి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు .జార్జ్ మేధస్సును గుర్తించిన ఎన్నో పేరుమోసిన సంస్థలు ,అప్పటికే పదులు సంఖ్య లో జాబ్స్ ఆఫర్ చేశాయి .ఇస్రో వారు కూడా జార్జ్ కి జాబ్ ఆఫర్ ఇచ్చారు ..జార్జ్ అనుకుంటే ఎదో ఒక జాబ్ లో జాయిన్ అవ్వి లగ్జేరియస్ లైఫ్ అనుభవించవచ్చు కానీ తనకు అవన్నీ గడ్డి పోస తో సమానమని కొట్టి పడేసాడు ..సమాజం కోసం ఎదో చెయ్యాలనే తపన విద్యార్థి నాయకుడిగా ఎదగాలంటే ముందు తనకు బలహీన వర్గాలు నుంచి వచ్చిన పేద విద్యార్థులకు మధ్య ఉన్న గేప్ ను తుడిచి వెయ్యాలనుకున్నాడు ..ఇక అప్పటి నుంచి జార్జ్ ఒకే పుట అన్నం తినటం మొదలు పెట్టాడు ఖరీదైన బట్టలను తగులబెట్టి ఖాకీ దుస్తులు ధరించాడు ,నేల మీద పడుకోవటం అలవాటు చేసుకున్నాడు .1969 నుండి 70 మధ్య లో సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయన్స్ తో కాంగ్రెస్ పార్టీ దిగువ కేడర్ లో యాంగ్ టర్కులు బృందం ఉపిరిపోసుకుంది ..యాంగ్ టర్కులు పెట్టుబడి దారి వ్యవస్థను సంస్కరించటానికి నడుం కట్టారు ..భూస్వాములు కు వ్యతిరేకం గా పోరాడుతున్న యంగ్ టర్కులు భావజాలాలు జార్జ్ ను ఎంతగానో ఆకర్శించాయి ..తన స్నేహితుడు కే శ్రీనాద్ రెడ్డి తండ్రి కేంద్ర మంత్రి కే రఘునాధ రెడ్డి ప్రోద్బలం తో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘమైన యూత్ కాంగ్రెస్ చేరాడు ..కానీ పార్టీ లో చేరిన కొద్దీ రోజులకే ఇదంతా పెట్టుబడి దారి వ్యవస్థను కొత్త ముసుగులో కాపాడటానికి పుట్టిన ఎత్తుగడ అని జార్జ్ కి అర్థమైంది అంతే అప్పటికప్పుడు పార్టీకి రాజీనామా చేసి తానే స్వయంగా తన భావజాలం తో కూడిన ఒక గ్రూప్ ను ఏర్పరుచుకున్నాడు..ఈ గ్రూప్ ప్రోగ్రసివ్ డెమోక్రటిక్స్ స్టూడెంట్ గ్రూప్ గా అని పిలుచుకునేవారు .బడుగు ,బలహీన స్టూడెంట్స్ మరియు ఈవ్ టీజింగ్ కి గురవుతున్న ఆడపడుచులలో పదునైన ప్రసంగాలతో ధైర్యాన్ని నింపాడు ..వాళ్ళేం చేస్తే అది భరించటానికి మనం బానిసలం కాదు అందరు కలిసికట్టుగా ఉండి ఎదురు తిరిగితే ఆకతాయి రౌడీ మూకలు భరతం పట్టవచ్చు అని కొత్త ఆశ లను చిగురింపచేసాడు ..దాంతో ఒక్క సారిగా యూనివర్సిటీ మొత్తం జార్జ్ రెడ్డి పేరు మారుమోగింది ..ఎంతగా అంటే జార్జ్ పేరు చెపితే చాలు బడాబాబులు సైతం తోకముడుచుకుని పారిపోయేవారు ..

జార్జ్ అక్కడితో ఆగలేదు ,హైదరాబాద్ మొత్తానికి తన భావజాలాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు దాంతో అప్పటితో కుర్ర కుంక అని తేలిగ్గా తీసుకున్న బడా నేతలు సీటుకింద భూకంపం వచ్చినంత పనైపోయింది …సరిగ్గా ఆ సమయం లో ఉస్మానియా కేంపస్ లో స్టూడెంట్స్ ఎలక్షన్స్ జరిగాయి ..ఆ ఎలక్షన్స్ లో జార్జ్ రెడ్డి నిలబెట్టిన బడుగు బలహీనవర్గాలకు చెందిన ఓ విద్యార్థి బంపర్ మెజారిటీ తో విజయం సాధించాడు ..ఆ ఓటమిని తట్టుకోలేక కొందరు బడాబాబులు జార్జ్ రెడ్డి ని చంపటానికి స్కాచ్ వేశారు జార్జ్ ని ఒంటరిగా దొరికించుకుని రౌండ్ అప్ చేసారు కానీ జార్జ్ రెడ్డి దగ్గర బుద్ది బలం మాత్రమే కాదు కండ బలం కూడా వుంది. రోజు జిమ్ములో కసరత్తులు చేస్తూ పిట్ గా ఉండేవాడు అంతేకాదు జార్జ్ కి బాక్సింగ్ కూడా వచ్చు ఇంకేముంది సినీ ఫైట్ ని తలదన్నే రీతిలో జార్జ్ ఒంటరిగా ఫైట్ చేసి అక్కడ నుండి తప్పించుకున్నాడు ..జార్జ్ ఒళ్ళంతా గాయాలతో తడిసి ముద్దైపోయింది హాస్పిటల్ చేరాల్సి వచ్చింది ..జార్జ్ ప్రాణానికి ముప్పు ఉందని జాగర్త గా ఉండాలని పోలీసులు హెచ్చరించారు ..స్నేహితులు కూడా జార్జ్ ని కంటికి రెప్పలా కాపలా కాసేవారు కానీ జార్జ్ వారితో ఇలా అనేవాడట నా ప్రాణాకేం కాదు నేను అనుకున్నది సాధించేవరకు నాకు మరణం రాదు అని అనేవాడట …కానీ విది మరోలా వింతనాటకం ఆడింది ..ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి ..ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పోజిషన్ పార్టీలు పావులు కదుపుతున్నాయి కానీ ఈ సారి కూడా జార్జ్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్దే విజయం సాధిస్తాడని అప్పటికే ఊహాగానాలు జోరందుకున్నాయి ..పిల్లి పిల్లలు లా కాళ్ళకింద పడి ఉన్న ఈ స్టూడెంట్స్ ఇంత దైర్యం గా ఎదురు తిరుగుతున్నారు అంటే అందుకు కారణం వాళ్ళ గుండెల్లో జార్జ్ రెడ్డి ఉన్నాడనే ధైర్యం ..ఆ ధైర్యం చావాలంటే గుండెల్లో ఉన్న జార్జ్ రెడ్డి ని చంపాలి కొంత మంది బడాబాబులకు ఇదే ఆలోచన వచ్చింది .యూనివర్సిటీ కేంపస్ బయటనుండి కొత్త మంది కిరాయి రౌడీలకు ఫోన్ కొట్టారు బయట నుండి 30 మంది కిరాయి గుండాలు విద్యార్థుల ముసుగులో క్యాంపస్ లోకి ప్రవేశించారు ..కొంతమంది అమాయకులపై బడాబాబులు దౌర్జన్యం చేస్తున్నారని జార్జ్ రెడ్డి నమ్మకస్తుడైన ఓ స్నేహితుడి తో కిరాయి గుండాలు కబురు పంపారు ..అది విన్న జార్జ్ రెడ్డి అప్పటికప్పుడు తన ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా ఒంటరిగా వారిని కాపాడటానికి బయలు దేరాడు ఆ రోజు 1972 ఏప్రిల్ 4 వ తేదీ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ దగ్గర 30 మంది కిరాయి గుండాలు జార్జ్ ను చుట్టుముట్టారు .ఒకటి కాదు రెండు కాదు మొత్తం 60 కత్తి పోట్లు పొడిచి జార్జ్ ను అత్యంత కిరాతకం గా చంపేశారు …విప్లవ వీరుడు జార్జ్ మరణించిన అతని నినాదం ” బ్రతకాలంటే చావటం నేర్చుకో…అడుగడుగు పోరాడడం నేర్చుకో”అన్న నినాదం రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికి మారుమోగుతూనే వుంది .జార్జ్ ని చంపితే అతని అనుచరులలో ధైర్యం చచ్చిపోతుందని కొందరు కలలు కన్నారు కానీ వారి ధైర్యం అంతకు డబులైంది ..జార్జ్ ఇచ్చిన ప్రేరణ తో వారంతా కలిసి 1974 లో ప్రోగ్రసివ్ అండ్ డెమొక్రటిక్ జార్జ్ రెడ్డి చిరునవ్వు నవ్వుతూ మనకు కనిపిస్తూ నే ఉన్నాడు ..జోహార్ జార్జ్ రెడ్డి🙏✊✊✊

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments