చంద్ర‌ముఖి 2 లేటెస్ట్ అప్‌డేట్‌

Date:


లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏడాది పొడ‌వునా, త‌మ సినిమాల‌కు సినీ అభిమానుల‌కు స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇస్తూనే ఉంది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఇప్పుడు అదే క్యూలో చంద్ర‌ముఖి2ని ఇంక్లూడ్ చేసేసింది. చంద్ర‌ముఖి 2 సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రాఘ‌వ‌లారెన్స్ డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేశారు. పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 65వ సినిమా ఇది. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైగై పుయ‌ల్ వ‌డివేలు, మ‌హిమ నంబియార్‌, ల‌క్ష్మీ మీన‌న్‌, సృష్టి, రావు ర‌మేష్‌, విఘ్నేష్‌, ర‌వి మారియా, సురేష్ మీన‌న్‌, సుభిక్ష కృష్ణ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్ల న‌టిస్తున్నారు.
తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌నిచేశారు. ఆంట‌నీ కెమెరా హ్యాండిల్ చేశారు. హార‌ర్ కామెడీ జోన‌ర్ మ‌వీ ఇది. గ్రాండ్ స్కేల్‌లో తెర‌కెక్కించారు. చంద్ర‌ముఖి కాన్సెప్ట్ కి మన ద‌గ్గ‌ర స్పెష‌ల్ ఆడియ‌న్స్ ఉన్నారు. అలాంటివారిని మ‌రోసారి స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని ఈ సినిమాను తెరకెక్కించామ‌ని అన్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ తమిళ్ కుమ‌ర‌న్‌. వినాయ‌క చ‌వితి స్పెష‌ల్‌గా సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల కానుంది చంద్ర‌ముఖి2 అని చెప్పారు.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...