గుంటూరు కారంలో రాజకీయ నేపథ్యం

Date:


ఇప్పటికీ పలు వాయిదాలు వేసుకుంటూ ఆలస్యమైన గుంటూరు కారం ఎట్టి పరిస్థితుల్లో సంక్రాతి విడుదల మిస్ కాకుండా ప్లాన్ చేసుకుంటోంది. విదేశాలకు వెళ్తున్న మహేష్ కొంత గ్యాప్ ఇస్తున్నప్పటికే దాని వల్ల ఎలాంటి ప్రభావం పడకుండా త్రివిక్రమ్ షెడ్యూల్స్ రెడీ చేస్తున్నారు. తమన్ పాటల వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి వచ్చినట్టు లేదు. హీరో తిరిగి వచ్చేలోపు సాంగ్స్ కంపోజింగ్ పూర్తయితే వాటి షూట్ ని ఆలస్యం లేకుండా చూసుకోవచ్చు. జూలైని మినహాయిస్తే చేతిలో ఉన్నది కేవలం అయిదు నెలలే. డిసెంబర్ చివరి వారంలోగా మొత్తం ఫినిష్ చేస్తేనే టార్గెట్ చేరుకోవచ్చు.

వీళిద్దరి మధ్య జరిగే యుద్ధంలో హీరో మహేష్ బాబు ఎందుకు వచ్చాడనేది కీలకమైన పాయింట్ గా ఉంటుందని చెబుతున్నారు. నదియా, టబు లాగా రమ్యకృష్ణది ఇందులో కథకు ముడిపడిన చాలా కీలకమైన క్యారెక్టరని వినికిడి. ఆవిడకు సెపరేట్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందట. ఇదంతా గురూజీ ఫార్ములా ప్రకారమే వెళ్లినా ఎక్కడ కమర్షియల్ మసాలా మిస్ కాకుండా పక్కా యాక్షన్ మోడ్ లో రూపొందిస్తున్నట్టు టాక్. ఖలేజాలో కామెడీ టైమింగ్ ని అతడులో యాక్షన్ కి మిక్స్ చేసి ఓ కొత్త రకం ఫ్లేవర్ తో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకం ఫ్యాన్స్ లో కలిగిస్తారట.

అందరూ అనుకుంటున్నట్టు గుంటూరు కారం కేవలం ఫ్యామిలీ ఎలిమెంట్స్ కు కట్టుబడలేదు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఊహించని అంశాలు చాలానే పొందుపరిచారని ఇన్ సైడ్. ముఖ్యంగా పొలిటికల్ టచ్ కూడా బలంగానే ఉంటుందట. దానికో ప్రధానమైన లీక్ బలం చేకూరుస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు వైర వెంకటస్వామి. వయసు 80 సంవత్సరాలు. జనదళం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వ్యవహారాలు చక్కదిద్దుతూ ఉంటారు. ఈయనకు ప్రధాన ప్రత్యర్థి జగపతి బాబు. జాలి దయా ఏ కోశానా లేని పరమ దుర్మార్గుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...