హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఖుషి’కి శివ నిర్వాణ దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది. ‘గీత గోవిందం’ తరువాత ఆ స్థాయి సక్సెస్ లేని విజయ్ దేవరకొండకి, ‘మజిలీ’ అనంతరం ట్రాక్ తప్పిన శివ నిర్వాణకి, ‘శాకుంతలం’ రూపంలో రీసెంట్ గా డిజాస్టర్ చూసిన సమంతకి ‘ఖుషి’ ఫలితం ఎంతో కీలకంగా మారింది.