క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ జర్నీ `నిన్నిలా నిన్నిలా` .. సూపర్బ్ రెస్పాన్స్‌తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్
హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన క్యూట్ లవ్‌స్టోరి `నిన్నిలా నిన్నిలా` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 5న ఈ సినిమా ట్రైలర్‌ను మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుదల చేసి.. సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే…
దేవ్ పాత్రలో అశోక్ సెల్వన్, తార పాత్రలో రీతూ వర్మ, మాయ పాత్రలో నిత్యామీనన్ పాత్రలు ఆ పాత్రల మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్స్‌ను అందంగా చూపించారు. హీరో అశోక్ సెల్వన్, రీతూవర్మ పెద్ద స్టార్ హోటల్‌లో చెఫ్‌లుగా ఉంటారు. వారి మధ్య రిలేషన్ ఏంటి? అలాగే మాయ పాత్రలో నటించిన నిత్యామీనన్‌కు వీరితో ఉన్న లింకేంటి? అనే విషయాలను దర్శకుడు అని.ఐ.వి.శశి అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారని ట్రైలర్ చూస్తే అవగతమవుతుంది. ఇక సీనియర్ నటుడు నాజర్, కమెడియన్ సత్య పాత్రలేంటో తెలుసుకోవాలంటే `నిన్నిలా నిన్నిలా` సినిమా చూడాల్సిందే. అని .ఐ.శశి దర్శకత్వంలో అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌లపై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క్యూట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న `నిన్నిలా నిన్నిలా` సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని తెలియజేస్తామని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు.
నటీనటులు:అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ తదితరులు
క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ జర్నీ `నిన్నిలా నిన్నిలా`
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES