కొరియా ఓపెన్ లో భారత్ హవా.. ఫైనల్ చేరిన సాత్విక్-చిరాగ్ జోడీ..

Date:

కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్స్ లో ప్రవేశించారు. సాత్విక్ చిరాగ్ జోడీ అద్భుతంగా ఆడి ప్రత్యర్ధులను మట్టి కరిపించారు. 21-15, 24-22 తేడాతో చైనా జంటను ఓడించారు. తుది పోరుకు అర్హత సాధించారు.

సెమీస్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ గట్టి పోటీ ఎదుర్కొంది. లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ జోడీ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది. గతంలో అనేక సార్లు చైనా జోడీ చేతిలో పరాజయం పాలైన భారత జోడీ ఈ సారి తమ సత్తా చాటింది. అప్రతిహత విజయం అందుకుంది.

భారత బ్యాడ్మింటన్ రంగంలో సాత్విక్, చిరాగ్ జోడీ తిరుగులేని ముద్ర వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా విజయాలతో పతకాల పంట పండిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం అనేక సందర్భాల్లో వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు. మెడల్స్ సాధించిన తర్వాత ప్రధాని నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్వయంగా అభినందించారు. వారిలో మరింత స్పూర్తి నింపారు.

దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సాత్విక్, చిరాగ్ జోడీ ఈ ఏడాదిలో స్విస్ ఓపెన్, ఇండోనేషియా టోర్నీలను కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మరో టైటిల్ సాధించడంలో నిమగ్నమై ఉన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...