కొత్త సినిమాల తాకిడితో ఉక్కిరిబిక్కిరి  

Date:


ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూవీ లవర్స్ మాత్రం ‘ఒప్పెన్ హెయిమర్’ మీద కన్నేశారు. బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ‘బార్బీ’ మీద కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ రెండు ఇండియా వైడ్ అడ్వాన్స్ సేల్స్ లో ముందున్నాయి. ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పటికీ టాలీవుడ్ జనాలు మాత్రం రివ్యూలు, టాక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం వారం గ్యాప్ లో పవన్ కళ్యాణ్ బ్రో పెట్టుకుని ఆలోగానే వీలైనంత రాబట్టుకోవాలని చిన్న సినిమాలన్నీ ఇలా పోటెత్తున్నాయి. వీటిలో రెండో మూడో బాగున్నాయనిపించుకుంటే థియేటర్లు కళకళలాడతాయి. 

‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ మీద అంచనాలేం లేవు కానీ యూనిట్ మాత్రం అన్ని వర్గాలను మెప్పిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. సురేష్ సంస్థ అండదండలు ఉండటంతో థియేటర్ల పరంగా మద్దతు దక్కింది. రుహాని శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన ‘హర్ చాఫ్టర్ 1′ రేపే రానుంది. తనే విశ్వక్ సేన్ తో నటించిన హిట్ ఛాయలు కనిపిస్తున్నాయి. పబ్లిసిటీ వీక్ గా జరుగుతోంది.’అలా ఇలా ఎలా’ అంటూ వెరైటీ టైటిల్ తో మరో సినిమా బరిలో దిగుతోంది. నాతో నేను, ఒక్కడే వీరుడు, డిటెక్టివ్ కార్తిక్ వస్తున్న విషయమే జనాలకు తెలియదు. కాజల్ అగర్వాల్ ని నమ్ముకుని డబ్బింగ్ మూవీ ‘కార్తీక’ను తెస్తున్నారు.

ఇంకో బాక్సాఫీస్ సమరానికి తెరలేచింది. రేపు జూలై 21 కౌంట్ భారీగా ఉండబోతోంది. ఇది ముందుగానే గుర్తించిన ‘హిడింబ’ ఒక రోజు ముందుగా గురువారమే తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఒక డిఫరెంట్ హారర్ థ్రిలరనే టాక్ ప్రీమియర్ల నుంచి వచ్చింది కానీ అసలైన పబ్లిక్ తీర్పు ఇవాళ రానుంది. మిగిలినవి మాత్రం క్లాష్ కి సై అంటూ రంగంలోకి దిగుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగినది విజయ్ ఆంటోనీ ‘హత్య’. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ నెలల తరబడి వాయిదా పడుతూ ఎట్టకేలకు రిలీజ్ కు వచ్చింది. ఈ టీమ్ బిచ్చగాడు బ్రాండ్ నే నమ్ముకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...