చట్టప్రకారం నేరస్తులను శిక్షించాలి.దీనికి నేను 100 శాతం support చేస్తాను.
కానీ సమాజములో నేరస్తులను తయారు చేస్తున్న వాళ్ళను కూడా F I R లో చేర్చి , వాళ్ళను కూడా ప్రాసిక్యూట్ చేసి శిక్షించాలి అనేది ప్రజల డిమాండ్. న్యాయ వ్యవస్థ దీనిని పరిశీలించాలని నా అభిప్రాయం.
ప్రియాంక ,మానస ,లక్ష్మీ ల హత్యోదంతాలను కొత్త కోణం లో పరిశీలిద్దాం. ముందు ముందు ఇలా జరుగకూడదు అంటే సమాజములో ఎవరెవరు ఎం చేయాలో చూద్దాం.
ప్రియాంక కేసు ను పరిశీలిస్తే…..నేరము చేసిన నలుగురు బలహీన వర్గాల నుండి వచ్చిన వారే.4 గురి వయసు 20 నుండి 25 years మాత్రమే. నేను వెళ్లి ప్రత్యక్షంగా ఎంక్విరీ చేయ లేదు…కానీ పేపర్ ,tv ,సోషల్ మీడియా ద్వారా నాకు తెలిసింది ఏమంటే….నలుగురు కూడా ఆర్త్ధికంగా చితికిపోయిన కుటుంబం నుండి వచ్చిన వారే. తల్లి తండ్రులు వీరికి మంచి చదువు చెప్పించ లేదు , ఉద్యోగం వచ్చే వరకు సాదలేదు. వీరి వయసు కాస్త 10 years దాటగానే ,ఎదో ఒక పని చేసి నాలుగు డబ్బులు సంపాదించుకొని బ్రతకడం మొదలు పెట్టిన వాళ్లే.
తెగిన గాలి పటాలు వీళ్ళు. మన సమాజములో అన్ని అనగా ఆల్కహాలు ,నీలి చిత్రాలు , చెడు సినిమాలు సునాయాసంగా లభిస్తున్నాయి. వీళ్ళ తల్లిదండ్రులు ఉదయం లేవగానే పనికి పోయి రాత్రి వస్తారు. వీరు ఎం చేస్తున్నారో వాళ్ళు గమనించలేరు , ఒక వేళ గమనించినా వాళ్ళు చెబితే వీళ్ళు వినే స్థితిలో ఉండరు.
సమాజములోని విపరీత ఆర్ధిక అసమానతలే ఈ నేరాలకు కారణం. ఏ తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి బాగా ఉంటదో…..వాళ్ళ పిల్లలు కరెక్ట్ గా చదువుకొని , ఉద్యోగం చేస్తూ…ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వుంటారు. భవిష్యత్తు పచ్చగా కనిపిస్తే , ఏ యువకుడు చెడు దారిలో ప్రయాణించడు.
దేశ వ్యాప్తంగా కాశీ నుండి కన్యాకుమారి వరకు , ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా , నేరస్థులు 90 percent బడుగు బలహీన వర్గాల పిల్లలే ఉంటారు. ఆర్ధికంగా బలిసిన వాళ్ళ పిల్లలు ఇలాంటి పనులు చేస్తలేరా ? అంటే… చేస్తరు , కానీ వాళ్ళు ఇలా చేయరు…..car తీసుకొని పబ్బులకు ,క్లబ్బులకు వెళ్తారు….అక్కడ డబ్బులు ఎగజల్లి , ఆడి పాడి ,తాగి , అన్నీ అనుభవించి ఇంటికి పోతరు. ఇది తప్పుడు పనే….కానీ leagalised చేయబడినవి, క్లబ్బుల ముసుగులో.
ఆర్థిక స్థోమత లేని యువత ఈ విషయాలను tv ,సినిమా ,వీడియో ల ద్వారా చూసి ఉద్రేకానికి లోను అవుచున్నారు. జులాయిగా తిరిగే క్రమములో , ఎప్పుడో ఒకసారి ఇలా అవకాశం దొరుకుతె , ఇలా ప్రవర్తించి jail పాలు అవుచున్నారు.
దేశ వ్యాప్తంగా అన్ని జైళ్లలో వీల్లే , అనగా బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన వ్యక్తులే వుంటారు.
ఆర్ధికంగా బలిసిన కుటుంబాల వ్యక్తులు అన్ని అవసరాలను డబ్బులు ఇచ్చి కొనుక్కొని హాయిగా అనుభవిస్తారు.
పేదరికంలో మగ్గేవాళ్ళు ఆవేశాన్ని ,ఆకలిని ఆపుకోలేక దొంగతనంగా అనుభవిస్తారు. ఇది తప్పే ….కానీ ఎం చేద్దాం. ఎం చేయాలి ,ఎం చేయవద్దు అనేది వాళ్లకు తెలియదు , ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు , వాళ్లకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు . అందుకే అందరికి ఉచిత విద్య ,వైద్యం, ఉపాధి కలిపిస్తే…ఇలాంటి నేరాలు ఘోరాలు జరగవు.
అందుకే సమాజములో ఆర్ధిక మాఫీయా ను లేకుండా చేసి…..ప్రకృతి వనరులను సమానంగా అందరికి అందుబాటులో ఉండేలా చేయడం ఒక్కటే….నేర రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం.