కొడుకు కోసం బ్రహ్మాజీ వీర ప్రమోషన్లు  

Date:


ట్రైలర్ గట్రా చూస్తే చాలా వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందిన స్లం డాగ్ హస్బెండ్ కు ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా ధమాకా ఫేమ్  భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. హీరోయిన్ ప్రణవి మానుకొండని ఆకట్టుకునేలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ కంటెంట్ ఎక్స్ ట్రాడినరీగా ఉంటే తప్ప చిన్న సినిమాల కోసం జనం థియేటర్లకు రావడం లేదు. బేబీ, బలగం లాంటివి ధైర్యం ఇచ్చినా అవి సీరియస్ ఎమోషన్ల మీద నడిచాయి. స్లమ్ డాగ్ హస్బెండ్ పూర్తిగా కామెడీని నమ్ముకుంది. మరి ఏ మేరకు అంచనాలు నిలబెట్టుకుంటుందో చూడాలి.

శ్రీలీలను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా తీసుకు వచ్చేందుకు ఒప్పించారు. పుష్ప 2 సెట్ లో అల్లు అర్జున్ కి ట్రైలర్ చూపించి టీమ్ మొత్తంతో కాంప్లిమెంట్స్ అందుకోవడం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. సుకుమార్ వీడియో బైట్ పంపుతానని హామీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ దీనికి కుక్క మొగుడు టైటిల్ పెట్టమని సలహా ఇవ్వడం, స్క్రిప్ట్ లో అనిల్ రావిపూడి చేయూత, నాగార్జున అలీ లాంటి సెలబ్రిటీల మద్దతు ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మాజీ దగ్గరుండి మరీ షేర్ చేసుకుంటూ వీలైనంత వరకు బజ్ తీసుకొచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

మాములుగా పవన్ కళ్యాణ్ సినిమా బరిలో ఉందంటే ఎవరూ పోటీకి వచ్చేందుకు రిస్క్ తీసుకోరు. కానీ ఒక్క చిన్న చిత్రం ధైర్యం చేసిందంటే విశేషమే. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా రూపొందిన స్లం డాగ్ హస్బెండ్ రేపు విడుదల కాబోతోంది. బ్రోతో నేరుగా క్లాష్ చేయకుండా ఒక రోజు గ్యాప్ తీసుకుంటోంది. చిన్న మూవీ కావడంతో బ్రహ్మాజీ అంతా తానై ప్రమోషన్ల వ్యవహారాలు చూసుకుంటూ మీడియాతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. తన పరిచయాలన్నీ వాడుకుని కంటెంట్ బాగుందనే విషయాన్ని సెలబ్రిటీల ద్వారా చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

–  రాష్ట్ర ఉన్నత విద్యామండలి భవనం ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల...

పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు –

– ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం– ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారానికి...

సన్న బియ్యం పిరం –

– 15రోజుల్లో 25కిలోల బస్తాపై రూ.200పైనే పెంపు– వరిసాగు విస్తీర్ణం...

నేను సీఎం కావాలంటే మోడీ ఎన్‌ఓసీ అక్కర్లేదు

– మేం ఎవరికీ బీ టీం కాదు –  కాంగ్రెస్‌ సచ్చిన...