కీరవాణి కొడుకు.. కంటెంట్‌తో వస్తున్నాడు

Date:


ఈ జర్నీని ఎంటర్టైనింగ్‌గా, ఎమోషనల్‌గా డీల్ చేసినట్లున్నాడు కొత్త దర్శకుడు ఫణిదీప్. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించడం విశేషం. రవీంద్ర విజయ్, కావ్య కళ్యాణ్ రామ్, అనుహాసన్.. ఇలా మిగతా కాస్టింగ్ కూడా బాగానే కుదిరినట్లుంది. టెక్నికల్‌గా కూడా మంచి సౌండ్‌ ఉన్న సినిమాలా కనిపిస్తోంది ‘ఉస్తాద్’. మరి బలమైన కంటెంట్‌తో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో భారీ చిత్రాలతో పోటీ పడుతున్న ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

ఐతే తన కెరీర్ డోలాయమానంలో పడ్డ స్థితిలో సింహా మంచి సినిమాతో వస్తున్నట్లున్నాడు. తన కొత్త చిత్రం ‘ఉస్తాద్’ ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని తలపించేలా ఉంది ‘ఉస్తాద్ కథాంశం’. తన బైక్‌ను ఒక స్నేహితుడిలా భావిస్తూ దాంతో కలిసి చేసే భావోద్వేగ ప్రయాణంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించే ఓ కుర్రాడి కథ ఇది. డొక్కు బైకును నడిపిస్తూ గాల్లో విహరించే ఆ కుర్రాడు.. తర్వాత పైలట్‌గా విమానాన్ని నడిపించే స్థాయికి ఎదుగుతాడు.

కాలభైరవ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సంగీత దర్శకుడిగా బాగానే స్థిరపడ్డాడు. కానీ సింహా మాత్రం గాడి తప్పాడు. అతను తర్వాత చేసిన తెల్లవారితో గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ముఖ్యంగా ఈ నెలలోనే విడుదలైన ‘భాగ్ సాలే’ మరీ పేలవమైన చిత్రంగా పేరు తెచ్చుకుని సింహాతో పాటు కీరవాణి-రాజమౌళి కుటుంబం జడ్జిమెంట్‌నే ప్రశ్నార్థకం చేసింది.

టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన కొడుకులిద్దరినీ కూడా సినీ రంగంలోకే తీసుకొచ్చాడు. పెద్ద కొడుకు కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడిగా మారితే.. చిన్న కొడుకు సింహా మాత్రం తమ కుటుంబంలో ఎవ్వరూ వెళ్లని దారిలో వెళ్లి నటుడయ్యాడు. ఈ అన్నదమ్ములు కలిసి అరంగేట్రం చేసిన ‘మత్తు వదలరా’ ఇద్దరికీ మంచి పేరే తెచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...