5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeNewsకాపులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

కాపులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

కాపులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలను మంత్రి మండలితో చర్చించారు. వైఎస్సార్‌ నవశకం పథకాలపై, కొత్త పెన్షన్‌ కార్డులు, పెన్షన్‌ అర్హతల మార్పులపై చర్చించారు. అదే విధంగా కొత్త రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, జగనన్న విద్యా దీవెన కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిగ్రీ ఆపై ఉన్నత విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు జగనన్న వసతి పథకం కింద రూ. 20 వేలు చెల్లింపు, వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలపై, కొత్త బార్‌ పాలసీలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు:
►వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి రూ.1,101కోట్ల కేటాయింపు
►కాపు సామాజిక మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం
►45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు సాయం
►రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్న కాపులకు వైఎస్సార్‌ కాపు నేస్తం వర్తింపు
►పది ఎకరాల మాగాణి, 25ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు
►ట్రాక్టర్‌, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు
►టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19నుంచి 29కి పెంచుతూ నిర్ణయం
►పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం
►ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ

►ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌కు నిర్ణయం
►జగనన్న వసతి పథకానికి కేబినెట్‌ ఆమోదం​.రెండు విడతలుగా జగనన్న వసతి దీవెన, రూ.2,300 కేటాయింపు
►ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు
►డిగ్రీ, ఉన్నత విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం
►కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం.
►3.295 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.
►ఇనుప ఖనిజం సరఫరాపై ఎన్‌ఎండీసీతో ఒప్పందం
►ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రుణాలు
►మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం
►ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం రూ.3,400 కోట్లు కేటాయింపు
►రూ.225లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి విద్యాదీవెన వర్తింపు
►సీపీఎస్‌ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్‌ కమిటీకి ఆమోదం
►గిరిజన ప్రాంతాల్లో ఆశావర్కర్ల జీతం రూ. 400 నుంచి రూ.4వేలకు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments