కల్కి గా ప్రభాస్, వీడిన ప్రాజెక్ట్ – కే సస్పెన్స్

Date:





వాట్ ఈజ్ ప్రాజెక్ట్ – కే, ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న సినిమా కాబట్టి. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకి మొదటినుండి ప్రాజెక్ట్ – కే(వర్కింగ్‌ టైటిల్‌) అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కల్కి2898AD అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con) వేడుకలో చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించింది. దాంతో శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డుకెక్కింది. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అశ్వనీదత్‌తో పాటు రానా దగ్గుబాటి ఆ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

మహానటి తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక సీనియర్ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...