ఔను.. చ‌ర‌ణ్ సినిమా చేస్తున్నా: రెహ‌మాన్

Date:


తార‌క్‌తో చేయాల‌నుకున్న క‌థో, మ‌రొక‌టో కానీ.. చ‌ర‌ణ్‌తో బుచ్చిబాబు సినిమాను ఓకే చేసుకున్నాడు. హీరో మారినా.. సంగీత ద‌ర్శ‌కుడిగా మాత్రం రెహ‌మాన్‌నే పెట్టుకోవాల‌ని అత‌ను ఫిక్స‌య్యాడు. ఈ చిత్రంలో ఉప్పెన విల‌న్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించ‌నుండ‌గా.. జాన్వి క‌పూర్ క‌థానాయిక‌గా ప్ర‌చారంలో ఉంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని.. చాలా ఇంటెన్స్‌గా ఉంటుంద‌ని.. చ‌ర‌ణ్ ఇందులో స్పోర్ట్స్ మ‌న్ ట‌ర్న్డ్ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

స్వ‌యంగా రెహ‌మానే ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించాడు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. రామ్ చ‌ర‌ణ్-బుచ్చిబాబు సినిమాకు తాను ప‌ని చేస్తున్నాన‌ని.. ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్నాన‌ని రెహ‌మాన్ తెలిపాడు. ఉప్పెన త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌నుకున్నాడు బుచ్చిబాబు. ఆ సినిమా ఒక ద‌శ‌లో ఖ‌రారైంది కూడా. అప్పుడే రెహ‌మాన్‌తో అత‌ను సంగీత చ‌ర్చ‌లు మొద‌లుపెట్టాడు. కానీ త‌ర్వాత తార‌క్‌కు వేరే క‌మిట్మెంట్లు ఉండ‌టంతో బుచ్చిబాబు సినిమా నుంచి వైదొలిగాడు.

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఆల‌స్యం చేయ‌కుండా గేమ్‌ఛేంజ‌ర్ సినిమాను మొద‌లుపెట్టిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. దాని త‌ర్వాత ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా క‌మిటైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చి చాలా రోజులైంది. ఆ త‌ర్వాత ఏ అప్‌డేట్ లేదు. ఐతే ఈ సినిమా టీం నుంచి వ‌రుస అనౌన్స్‌మెంట్లు రాబోతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. చ‌ర‌ణ్ 16వ సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టుకి లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తాడ‌ని చాన్నాళ్ల ముందే వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ స‌మాచార‌మే నిజ‌మ‌ని తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...