‘పరేషాన్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా సోనీ ప్రకటించింది. ఇటీవల చిన్న పెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తుండగా.. పరేషాన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.