ఐస్ టబ్ లో కన్నీటితో సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్ !

Date:

ఖుషి సినిమా పూర్తి చేసిన సమంత ఒక ఏడాది పాటు షూటింగ్ లకు గ్యాప్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బ్రేక్ సమయంలో తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావిస్తుందట సామ్. ఈ మధ్య మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

అయితే ఈ రోజు పోస్ట్ చేసిన ఫోటోలో సమంత ఐస్ లో కూర్చొని కళ్లు మూసికొని ఉంది. అంతే కాకుండా సమంత కంటి నుంచి కూడా నీరు కారుతుంది. ఆ ఫోటోపై నాలుగు డ్రిగీలు, ఆరు నిమిషాలు అని ఉంది. అంటే సమంత నాలుగు డిగ్రీల ఐస్ ముక్కల్లో ఆరు నిమిషాల పాటు ఉందనమాట. సమంత ఫోటో చూసిన వారు సమంత చికిత్సలో భాగంగానే ఇలా చేస్తోందా.. అంటే సామ్ అంత బాధపడుతుందా అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే సామ్ గతంలో కూడా ఈ ఐస్ బాత్ చేసింది. ఐస్‌ గడ్డలు ఉన్న టబ్‌లో కూర్చొని ‘ఈ ఐస్‌ బాత్‌ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది’ అని అప్పట్లో పేర్కొంది.

చల్లటి నీటిలో కాసేపు అలానే ఉండటం ఐస్‌బాత్‌. క్రీడాకారులు, అధికంగా జిమ్‌ చేసేవారు అప్పుడప్పుడు ఐస్‌బాత్‌ చేస్తుంటారు. అలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల వ్యాయామం చేసి అలసిపోయిన కండరాలు త్వరగా విశ్రాంత స్థితిలోకి వస్తాయి. రక్త ప్రసరణ సులభతరం అవుతుంది. అయితే సమంత ఎక్కువగా వ్యాయామం చేస్తుంది కాబట్టి రిలాక్సేషన్ కోసం ఐస్‌బాత్‌ చేసి ఉండోచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే శాకుంతలం డిజాస్టర్ తరువాత సామ్, విజయ్ దేవర కొండతో కలిసి నటించిన ఖుషి సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...