ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda )హీరోగా వైష్ణవి హీరోయిన్ గా వచ్చిన చిత్రం బేబీ( Baby movie ).ఈ సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
మొదటి మూడు రోజుల్లోనే సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఆనంద్ దేవరకొండ కి మొదటి సక్సెస్ దక్కింది అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో భారీ అంచనాల నడుమ రూపొందిన బేబీ సినిమా లోని హీరోయిన్ పాత్ర పోషించిన వైష్ణవి గురించి ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆకట్టుకునే అందంతో పాటు ఈ అమ్మడి యొక్క అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.తెలుగు అమ్మాయి అయినా కూడా స్కిన్ షో చేయడం తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు.హాట్ ముద్దు సన్నివేశాల్లో నటించింది.
దాంతో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా( Social media ) లో మాట్లాడుకుంటున్నారు.సాధారణంగా ఒక ఉత్తరాది ముద్దుగుమ్మ ఈ రేంజ్ లో సక్సెస్ ను దక్కించుకుని.
ఈ రేంజ్ లో ముద్దు సన్నివేశాల్లో నటిస్తే తప్పకుండా సినిమా విడుదల అయిన రెండు మూడు రోజుల్లోనే రెండు మూడు ఆఫర్లు వచ్చేవి.
కానీ వైష్ణవి తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఇప్పటి వరకు ఒక్క సినిమా లో నటించే అవకాశం దక్కలేదు.ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగానే ఉందని కొందరు అంటున్నారు.
కానీ ఇప్పటి వరకు ఈమెకు ఆఫర్ ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.ముందు ముందు అయినా ఈమెకు కనీసం చిన్న హీరోల సినిమా లో అయినా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
C తెలుగు అమ్మాయి కాకుంటే ఇప్పటి వరకు మంచి ఆఫర్లు వచ్చేవి అనేది మీడియా సర్కిల్స్ లో టాక్.ఈ విషయమై ఈ తెలుగు అమ్మాయి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.