ఎన్టీఆర్ దేవరలో బన్నీ జూనియర్ ?

Date:


ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 5 విడుదల మిస్ కాకుండా యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడనే లీక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో తెలియదు. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ డ్రామాగా దేవర  రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎలాంటి ఒత్తిడి లేకుండా తగినంత సమయం వచ్చేలా తారక్ శివ ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తో ఉన్నారు. సోలో హీరోగా ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజయ్యే తారక్ మొదటి సినిమాగా దేవర మీద ఫ్యాన్స్ ఆశలు అన్నీ ఇన్నీ కావు. మరి ఫ్రెండ్ కోసం అర్హ నటించడానికి బన్నీ ఎస్ అంటాడా. చూద్దాం. 

దేవరలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం ఉండటంతో దానికి అర్హని అడిగినట్టు తెలిసింది. అయితే అంగీకారం వచ్చింది లేనిది ఇంకా తెలియదు. తారక్ బన్నీల మధ్య బావా అని పిలుచుకునేంత స్నేహం ఉంది. ట్విట్టర్ లో పరస్పరం అలా సంబోధించుకోవడం చూశాం. ఒకవేళ నిజంగా అడిగి ఉంటే మాత్రం అల్లు ఫ్యామిలీ నో చెప్పకపోవచ్చు. దేవర ఇటీవలే కీలక యాక్షన్ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే మరో ఫైట్ ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారు. బాగా బిజీగా ఉన్న అనిరుద్ రవిచందర్ పాటల కంపోజింగ్ అవ్వగానే వాటి చిత్రీకరణకు ప్లాన్ చేసుకుంటున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హను ఒక కీలక పాత్రకు ఎంపిక చేశారన్న టాక్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. శాకుంతలంలో సమంతా కొడుకు భరతుడిగా నటించిన అర్హకు ఆ సినిమా ఎంత డిజాస్టరైనా నటన, ఎక్స్ ప్రెషన్లను తనకు మంచి పేరు తెచ్చింది. సామ్, దేవ్ మోహన్ లాంటి సీనియర్లకు ధీటుగా మెప్పించిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఫలితం పక్కనపెడితే తనకో స్వీట్ మెమరీగా నిలిచిన మాట వాస్తవం. తండ్రిగా బన్నీ కూడా స్క్రీన్ మీద అర్హను చూసుకుని మురిసిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...