కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే ‘దేవర’ విడుదలైన వారం రోజులకే ‘కంగువా’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ‘దేవర’ విజయం ఎన్టీఆర్ కి కీలకం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ ఇమేజ్ ని ‘దేవర’తో నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాడు. మరోవైపు సూర్య మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కానీ, సౌత్ లో ‘దేవర’ రెండోవారం కలెక్షన్లపై ‘కంగువా’ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశముంది. మరి దీనిని దాటుకొని ‘దేవర’ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.