Thursday, August 18, 2022
HomeEntertainmentMovie Updates"ఎక్కడికో ఈ అడుగు'ఫస్ట్ లుక్ లాంచ్!!

“ఎక్కడికో ఈ అడుగు’ఫస్ట్ లుక్ లాంచ్!!

‘ఎఫెక్ట్స్ రాజు’గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో… ‘స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం “ఎక్కడికో ఈ అడుగు”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి సందర్భంగా యూనిట్ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.
గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


తమ చిత్రం కోసం 55 రోజులు రేయింబవళ్లు పని చేసిన యూనిట్ సభ్యుల సమక్షంలో “ఎక్కడికో ఈ అడుగు” ఫస్ట్ లుక్ లాంచ్ చేయించిన నిర్మాత అట్లూరి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చిత్ర దర్శకులు రాజు బొనగాని అన్నారు.
1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి.
మార్చిలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: వెంకటేష్ ఆరె, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రమన్ లోక్ వర్మ, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాతినేని సుజన్ బాబు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజు బొనగాని!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments