హిందూ మతంలో రాఖీ పండుగ( Raksha Bandhan )కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు.
ప్రతి ఏడాది శ్రావణమాసంలోనే శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు.ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకి రక్షను కట్టి తమ సోదరుడి దీర్ఘాయుష్షు కోసం దేవుడిని ప్రార్థిస్తారు.
అదే సమయంలో సోదరులు తమ సోదరీమణులను జీవితాంతం కాపాడుతారని వాగ్దానం చేస్తారు.రాఖీ అనేది కేవలం పట్టుదరం మాత్రమే కాదు.

తన సోదరిని కాపాడుతానని సోదరులు చేసే వాగ్దానం.రాఖీ( Rakhi ) పండుగను ఎప్పుడు జరుపుకోవాలి.రాఖీ కట్టడానికి శుభ సమయం( Good time ) ఎప్పుడో తెలుసుకుందాం.రాఖీ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన జరుపుకున్నారు.అయితే రాఖీ పండుగ రోజున భద్ర నీడ ఉండడంతో రాఖీ కట్టడంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది.భద్రకాల సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు.ఆగస్టు 30వ తేదీన ఉదయం 10.59 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల రెండు నిమిషముల వరకు భద్రకాల సమయం ఉంది.

కాబట్టి ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదు.అందుకే ఈ భద్రకాల సమయం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం మంచిది.ఆగస్టు 31 ఉదయానికి భద్రకాలి ముగుస్తుంది.అందుకే రాఖీ కట్టడానికి ఈ సమయం బాగుంటుంది.ఆగస్టు 30వ తేదీ ఉదయం భద్రకాలి కారణంగా రాఖీ కట్టరు.మరోవైపు ఆగస్టు 30న రాఖీ కట్టాలనుకుంటే రాత్రి 9 గంటల 15 నిమిషముల తర్వాత శుభ ముహూర్తం మొదలవుతుంది.
ఈ సమయంలో ఈ పండుగను జరుపుకోవాలని ఆగస్టు 30, 31వ తేదీ రెండు రోజుల్లో కట్టవచ్చు.అయితే ఆగస్టు 31వ తేదీ ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టే శుభసమయం ఉందని గుర్తుపెట్టుకోవాలి.

BUSINESS – TELUGU