ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులకి కావల్సిన వినోదం అందుతుంది. థియేటర్స్ లో సినిమాలు నిరాశపరచిన కూడా ఓటీటీలో మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకి మంచి మజా దక్కుతుంది. ఇక గత రెండు వారాలుగా థియేటర్లలో చిన్న సినిమాలే విడుదల అవుతూ వచ్చాయి.
కానీ ఈ వారం మాత్రం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జూలై 28 న విడుదల కానుంది. దీంతో అందరు థియేటర్స్‌కి పరుగులు పెడుతున్నారు. బ్రో సినిమాతో పాటు థియేటర్‌లో ఈ వారం రిలీజ్ కానున్న మరో చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. సంజయ్ రావు హీరోగా ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జులై 29 న విడుదల కానుంది. ఇక బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, అలియా భట్ కలిసి నటించిన మూవీ ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ అనే బాలీవుడ్ చిత్రం జూలై 28 న విడుదల కానుంది.