గోవా బ్యూటీ ఇలియానా ( Ileana ) త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.ప్రస్తుతం 9 నెలల గర్భంతో ఉన్నటువంటి ఈమె మరి కొద్ది రోజులలో బిడ్డకు జన్మనిస్తూ తల్లి కాబోతున్నారు.
పెళ్లి కాకుండా ఇలియానా తల్లి కాబోతున్నాననే విషయాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.అయితే ఈమె గర్భవతి ( Pregnant ) అన్న విషయాన్ని తెలియజేసినప్పటికీ తన గర్భానికి కారణం ఎవరు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాలను మాత్రం తెలియజేయలేదు.
ఇలా తన ప్రియుడిని రహస్యంగా ఉంచినటువంటి ఈమెకు తరచూ నెటిజన్స్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నలు వేసేవారు.

ఈ విధంగా ఆ వ్యక్తిని రహస్యంగా ఉంచినటువంటి ఇలియానా తరచూ తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను మాత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు.అయితే ఈమె తన ప్రియుడు ఫోటోలను ఇదివరకే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినప్పటికీ ఎక్కడా కూడా తన ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.దీంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ ( Boy Friend )ఎవరు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి.
అయితే ఈమె తన బిడ్డతో పాటు తన ప్రియుడిని కూడా ఒకేసారి పరిచయం చేయబోతారా అనే సందేహాలు వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండడం ఇలియానా మరికొద్ది రోజులలో బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో తన ప్రియుడితో కలిసి ఈమె డిన్నర్ డేట్ వెళ్ళినట్టు ఉంది.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలలో తన ప్రియుడు ఫేస్ రివిల్ చేసినప్పటికీ ఆయన వివరాలను మాత్రం ఈమె వెల్లడించలేదు.
గుబురు గడ్డంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి చూడటానికి విదేశీ వ్యక్తుడు లాగే ఉన్నారని తెలుస్తోంది.అయితే ఇన్ని రోజులు ఈమె కత్రినా కైఫ్ సోదరుడు సెభాష్టియన్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తెలుస్తోంది.
మరి ఇలియానా షేర్ చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరు ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
