ఇలా ఎప్పుడు జరగలేదు బ్రో

Date:


దీని వల్ల ఓపెనింగ్స్ ఫిగర్స్ మీద ప్రభావమైతే ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందల వేల షోలు ఎర్లీ మార్నింగ్ వేయకపోవడం వల్ల కోట్లలో గ్రాస్ మిస్ అవుతుంది. మొదటి రోజు రికార్డుల మీద డిబేట్లు చేసుకునే ఫ్యాన్స్ కి  ఇది ఇబ్బంది కలిగిస్తుంది. అఫ్కోర్స్ కంటెంట్ బాగుంటే తర్వాతైనా పవన్ మొత్తం లాగేస్తాడు కానీ ఎంతైనా ఫస్ట్ డే నమోదయ్యే ఫిగర్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. స్క్రీన్ కౌంట్ పరంగానూ బ్రోకు రావాల్సిన పెద్ద నెంబర్ చుట్టూ ఉన్న కొత్త పాత సినిమాల వల్ల దక్కలేదు. ఇన్ని ప్రతికూలతలు దాటుకుని వచ్చిన బ్రో ఎలా ఉన్నాడో ఇంకో రెండు మూడు గంటల్లో తేలిపోతుంది 

ఎప్పుడో 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలుపెట్టి భీమ్లా నాయక్ దాకా ఏపీ తెలంగాణలో పవన్ సినిమాలు దాదాపు అన్ని చోట్ల స్పెషల్ షోలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం దాన్ని బ్రేక్ చేశారు. దీని వెనుక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలివైన ఎత్తుగడ ఒకటుంది. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్లు అడగటం పెద్ద ప్రహసనం. ఎందుకొచ్చిన తలనొప్పని వద్దనుకున్నారు. నైజామ్ లో కెసిఆర్ సర్కారుతో ఎలాంటి సమస్య లేకపోయినా ఒకేసారి ప్రదర్శనలు జరగాలన్న ఉద్దేశంతో కనీసం ఎక్స్ ట్రా షో కోసమైనా అనుమతి కొరకపోవడం ట్విస్టు.

ఇవాళ బ్రో విడుదలైపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తెల్లవారుఝామున  4 నుంచి  6 గంటల లోపు బెనిఫిట్ షో పడకపోవడం ఒక్క దీని విషయంలోనే జరిగిందని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. యుఎస్ ప్రీమియర్లు అనుకున్న టైంకి స్టార్ట్ అయ్యాయి. రిపోర్ట్స్ కూడా మొదలయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉదయం 7 కన్నా ముందు ఎక్కడ షో వేయకపోవడం చూసి అభిమానుల ఫీలింగ్ మాములుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నప్పటికీ సూర్యుడు రాకముందే థియేటర్ల దగ్గరకు వెళ్లి సందడి చేస్తే ఆ కిక్కే వేరు. అది మిస్ అవ్వడం వాళ్ళను బాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి దిశగా సింగరేణి –

– సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వండి : ఉన్నతాధికారులకు సీఎమ్‌డీ అదేశాలునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోసింగరేణి...

మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన –

– ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి– రోడ్లు ఊడ్చిన ఆశాలునవతెలంగాణ- విలేకరులుసమస్యలను...

కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

–  రాష్ట్ర ఉన్నత విద్యామండలి భవనం ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల...

పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు –

– ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం– ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారానికి...