ఇదేం ప్లానింగ్ బ్రో?

Date:


ఇంత ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి అనుకున్న డేట్ కి ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్న మేకర్స్ ప్రమోషన్స్ లో మాత్రం ప్లానింగ్ మిస్ అయ్యారు. సినిమా రిలీజ్ కి ఇంకా ఇరవై రోజులే ఉండగా ఇప్పుడు ఒక్కో సాంగ్ వదులుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ -సాయి తేజ్ కాంబో సినిమా అంటే ఇప్పటి నుండే భారీ బజ్ తీసుకురావాలి. కానీ మేకర్స్ కి సరైన ప్రమోషన్ స్ట్రాటజీ లేకపోవడంతో సినిమాకి ఇంకా ఆశించిన బజ్ రావడం లేదు. మరి ఇరవై రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్స్ తో టీం ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో ? ఇంత తక్కువ టైమ్ లో సినిమాపై హైప్ తెచ్చే మరేమైనా ప్లాన్  చేస్తున్నారో ? తెలియాలి.

అయితే మేకర్స్ ముందు నుండి ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా తీసి బిజినెస్ చేసుకోవాలని భావించారు. ప్రీ ప్రొడక్షన్ పక్కగా చేసుకొని మేకింగ్ డేస్ తగ్గించుకున్నారు. దీంతో రెండు నెలల్లోనే సినిమా కంప్లీట్ అయిపోయింది. పైగా ఒరిజినల్ దర్శకుడు సముద్రఖని నే దర్శకత్వం కాబట్టి వర్క్ చాలా ఫాస్ట్ గా అనుకున్నట్టు జరిగింది. ప్రస్తుతం సినిమాకు రీరికార్డింగ్ జరుగుతుంది. 

పవర్ స్టార్ నుండి  సినిమా వస్తుందంటే నెల ముందు నుండే హంగామా మొదలవుతుంది. సోషల్ మీడియాలో ఆ సినిమా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్స్ తో రచ్చ రచ్చ ఉంటుంది. కానీ ఇదే నెలలో మరో పాతిక రోజుల్లో రిలీజ్ అవుతున్న ‘బ్రో’ కి మాత్రం సరైన ప్రమోషన్ ప్లానింగ్ లేనట్టు కనిపిస్తుంది. ‘వినోదాయ సితమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బల్క్ లో పాతిక రోజుల పాటు డేట్స్ ఇచ్చి జెట్ స్పీడులో ఘాట్ కంప్లీట్ చేశాడు పవన్. పవన్ ఘాట్ పార్ట్ కంప్లీట్ అవ్వగానే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేశారు మేకర్స్. జులై 28 న సినిమా రిలీజ్ అంటూ ప్రకటించగానే పవన్ ఫ్యాన్స్ సైతం షాక్ తిన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...