ఇంట్రెస్టింగ్ గా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ ఫస్ట్ లుక్..

Date:





సినిమాల నుంచి కొంత కాలం విరామం తీసుకున్న హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి బాణం, సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎంచుకొని, పాత్రలలో వైవిధ్యం చూపించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రోహిత్ ఇప్పుడు మరో పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో వస్తున్నారు. తాజాగా తన 19వ చిత్రాన్ని ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమాకు ‘ప్రతినిధి 2’ అనే టైటిల్ ఫైనల్ చేసారు. 2014లో నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినట్లయితే నారా రోహిత్ బాడీ మొత్తం న్యూస్‌ పేపర్లతో చాలా ఆసక్తికరంగా వుంది. అంతేకాదు “One man will stand again, against all odds” అని రాసిన కోట్ మరింతగా ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

కాగా వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా టీవి 5 మూర్తి (మూర్తి దేవ‌గుప్త‌పు) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...