ఆ ఒక్క చోట మాత్రమే ఖుషి

Date:


అక్కడ మాత్రమే ‘ఖుషి’ బ్రేక్ ఈవెన్ అయింది. నైజాంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.16 కోట్లు కాగా.. ఇంకో మూడు కోట్లు మైనస్‌లోనే ఉంది. ఫుల్ రన్లో ఈ మార్కును అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. స్వల్ప నష్టాలు తప్పేలా లేవు. ఏపీలో అయితే ఇంకా  రూ.15 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. అక్కడ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది. మొత్తంగా చూస్తే ఒక్క యుఎస్ బయ్యర్ మినహా ‘ఖుషి’ డిస్ట్రిబ్యూటర్లెవ్వరూ ‘ఖుషి’గా లేరన్నది వాస్తవం.

సోమ, మంగళవారాల్లో కలిపి ‘ఖుషి’ వరల్డ్ వైడ్ రూ.3 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. యుఎస్, నైజాంలో మాత్రమే ఓ మోస్తరుగా షేర్ వచ్చింది. కానీ ఏపీలో సినిమా పూర్తిగా డౌన్ అయిపోయింది. ‘ఖుషి’ బ్రేక్ ఈవెన్ మార్కు రూ.52 కోట్లు కాగా.. ఇంకో 20 కోట్ల టార్గెట్‌తో వీక్ డేస్‌లో ప్రయాణం మొదలుపెట్టిన సినిమా.. రెండు రోజుల వ్యవధిలో రూ.రెండున్నర కోట్లకు అటు ఇటుగా షేర్ రాబట్టింది. యుఎస్‌‌లో ఈ చిత్రం 1.5 మిలియన్ మార్కును టచ్ చేసింది.

రూ.32 కోట్ల మేర షేర్ రాబట్టింది. సినిమా కాంబినేషన్ రేంజ్, వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఇవి చాలా మంచి వసూళ్లనే చెప్పాలి. కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. మిక్స్డ్ టాక్‌కు తోడు వర్షాల ప్రభావం సోమవారం నుంచి సినిమా మీద బాగానే పడింది. వీకెండ్ అవ్వగానే వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా క్రాష్ అయిపోయింది.

విజయ్ దేవరకొండ, సమంతల క్రేజీ కాంబినేషన్లో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ సినిమా విడుదలకు ముందు మంచి హైపే తెచ్చుకుంది. ముఖ్యంగా పాటలే ఈ సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి ఉంటే దాని వసూళ్ల కథే వేరుగా ఉండేది. ఐతే యావరేజ్ టాక్‌తోనే ‘ఖుషి’ తొలి వీకెండ్లో భారీ వసూళ్లే రాబట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...