ఆంధ్ర వాడు అంటూ నాపై చిల్లర కామెంట్స్ చేశారు… నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్!

Date:


సినీ ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా సపోర్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బ్రహ్మాజీ ( Brahmaji ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

 They Made Small Comments On Me Saying That He Is An Andhra Man, Brahmaji, Sanjay-TeluguStop.com

సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ట్వీట్ చేసినా ఏదైనా వేదికపై మాట్లాడిన భారీ స్థాయిలో నవ్వులు పూయిస్తూ మాట్లాడుతూ ఉంటారు.

Telugu Brahmaji, Hyderabad, Sanjay Rao, Slum Dog-Movie

ఇకపోతే తాజాగా ట్విట్టర్ వేదికగా ఈయన చేసినటువంటి ఒక ట్వీట్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఇంతకీ ఈయన ట్విట్టర్ వేదికగా ఎలాంటి ట్వీట్ చేశారు అనే విషయానికి వస్తే గతంలో తాను బోటు కొనుక్కోవాలి అనుకుంటున్నాను సూచనలు ఇవ్వండి అంటూ ట్వీట్ చేశానని అయితే దానిపై చాలా విమర్శలు వచ్చాయి అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్( Sanjay Rao ) హీరోగా స్లమ్ డాగ్ హస్బెండ్( Slum Dog Husband ) అనే సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Brahmaji, Hyderabad, Sanjay Rao, Slum Dog-Movie

హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా తాను తన భార్య కారులో ప్రయాణిస్తున్నాము అప్పటికే వర్షం ఎక్కువగా రావడంతో ఇంటికి వెళ్లే దారులని నీటితో నిండిపోయాయి దాంతో తెలిసిన వారి ఇంట్లో కారు పెట్టి పక్కనే ఉన్న వంతెన మీదగా మా ఇంటికి చేరుకున్నాము.అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాకు సహాయం చేశారు.ఇదే విషయాన్ని తాను సెటైరికల్ గా బోటు కొనుక్కోవాలి అనుకుంటున్నాను అంటూ దానికి హైదరాబాద్ రెయిన్ అనే ట్యాగ్ చేశానన్నారు.అయితే ఈ విషయంపై తనని చాలామంది ట్రోల్ చేశారు.

అప్పటికి నేను వివరణ ఇచ్చిన చాలామంది నన్ను ఆంద్రోడా అంటూ నాపై చిల్లర కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సన్న బియ్యం పిరం –

– 15రోజుల్లో 25కిలోల బస్తాపై రూ.200పైనే పెంపు– వరిసాగు విస్తీర్ణం...

నేను సీఎం కావాలంటే మోడీ ఎన్‌ఓసీ అక్కర్లేదు

– మేం ఎవరికీ బీ టీం కాదు –  కాంగ్రెస్‌ సచ్చిన...

తెలంగాణ ఓటర్లు 3,17,32,727 –

– కొత్త ఓట్లు 17.01 లక్షలు తుది జాబితా విడుదలనవ...

15 శాతం ఐఆర్‌ ప్రకటించాలి –

– సీఎస్‌ ఓఎస్డీ విద్యాసాగర్‌కు యూఎస్‌పీసీ వినతినవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌రాష్ట్రంలోని ఉద్యోగులు,...