అమెరికా : ఇజ్రాయెల్ ‘‘జాత్యహంకార’’ దేశమన్న ప్రమీలా జయపాల్, వివాదం.. చివరికి క్షమాపణలు

Date:


భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు , ప్రొగ్రెసివ్ డెమొక్రాట్ల సమూహానికి నేతృత్వం వహిస్తున్న ప్రమీలా జయపాల్( Pramila Jayapal ) ఇజ్రాయెల్‌కు క్షమాపణలు చెప్పారు.ఆ దేశాన్ని జాత్యహంకార రాజ్యంగా అభివర్ణిస్తూ జయపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 Indian-origin Us Congress Woman Pramila Jayapal Calls Israel 'racist', Apologise-TeluguStop.com

దీనిపై దుమారం రేగడంతో ఆమె ఇజ్రాయెల్‌కు క్షమాపణలు చెప్పారు.ఒక దేశంగా ఇజ్రాయెల్( Israel ) ఆలోచన జాత్యహంకారమని తాను నమ్మనని జయపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ( Benjamin Netanyahu )మితవాద ప్రభుత్వం వివక్షాపూరిత, పూర్తిగా జాత్యహంకార విధానాలలో నిమగ్నమైందని ప్రమీలా జయపాల్ వ్యాఖ్యానించారు.ప్రస్తుత ప్రభుత్వ నాయకత్వంలో ఆ విధానాన్ని నడిపిస్తున్న తీవ్ర జాత్యహంకారవాదులు వున్నారని తాను నమ్ముతున్నట్లు ఆమె అన్నారు.

Telugu Apologises, Hakeem, Indianorigin, Isaac Herzog, Israel, Pramila Jayapal,

మీడియా నివేదికల ప్రకారం.పాలస్తీనా అనుకూల నిరసనకారులు చికాగోలో జరిగిన ఒక సమావేశంలో చర్చకు అంతరాయం కలిగిస్తున్న సమయంలో ప్రమీల ఇజ్రాయెల్‌ను జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యానించారు.ఈ కామెంట్స్ పెద్ద దుమారం రేపడంతో హౌస్ డెమొక్రాటిక్ లీడర్ హకీమ్ జెఫ్రీస్( Hakeem Jeffries ), మరో ముగ్గురు నేతలు ప్రమీలాను మందలించారు.ఇజ్రాయెల్ జాత్యహంకార దేశం కాదన్నారు.

హౌస్ రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో విభేదించినట్లే.ప్రస్తుత ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వంలోనూ విభిన్న సభ్యులు వున్నారని హకీమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఈ ప్రకటనలో జయపాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

Telugu Apologises, Hakeem, Indianorigin, Isaac Herzog, Israel, Pramila Jayapal,

యూఎస్ కాంగ్రెస్( US Congress ) ఉభయ సభల సమావేశంలో ప్రసంగించాల్సిందిగా యూఎస్ హౌస్ సెనేట్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను( Isaac Herzog ) ఆహ్వానించడంతో ఈ వివాదం తలెత్తింది.కాంగ్రెస్ ప్రొగ్రెసివ్ కాకస్‌కు చెందిన సభ్యులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరుకాలేమని సంకేతాలిచ్చారు.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వున్న వివాదం పరిష్కారానికి తాను చాలాకాలంగా మద్ధతు ఇస్తున్నానని ప్రమీలా జయపాల్ తెలిపారు.

వివాదాస్పద ప్రాంతాలలో ఇజ్రాయెల్ స్థిర నివాసాల విస్తరణకు మాత్రం తాను వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...