అనిల్ రావిపూడి మెడపై బ్రహ్మాజీ కత్తి

Date:


ఈ రోజుల్లో ఈ మాత్రం వెరైటీ ప్రమోషన్లు లేకపోతే.. చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టమే. ఇంతకుముందు ‘పిట్ట కథ’ అనే వైవిధ్యమైన సినిమాతో సంజయ్ రావు హీరోగా పరిచయం అయ్యాడు. కానీ అది అంతా ఆడలేదు. ఇప్పుడు అతను ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అవతారం ఎత్తాడు. అతడికి జోడీగా ప్రణవి మానవికొండ నటించింది.

దానికి అనిల్ స్పందిస్తూ.. ‘‘ఎన్నిసార్లు వస్తావన్నా. మొనన మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్ అన్నావు. తర్వాత సాంగ్ అన్నావు. నేను తప్ప ఎవరూ లేరా నీకు’’ అంటూ చికాకు పడ్డాడు. వెంటనే బ్రహ్మాజీ కత్తి తీసి అనిల్ మెడ మీద పెట్టి రిలీజ్ డేట్ గురించి చెప్పమంటే.. అతను తడబడుతూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ అనడం.. బ్రహ్మాజీ సినిమా పేరు ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అని కరెక్ట్ చేయడం.. తర్వాత రిలీజ్ డేట్ చెప్పి ప్రేక్షకులను ఈ సినిమా చూడాలని కోరడం.. ఇదంతా సరదాగా సాగిపోయింది.

ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 21కే అనుకున్న సినిమాను ఎనిమిది రోజులు వాయిదా వేశారు. ఇక వీడియో విషయానికి వస్తే.. ‘భగవంత్ కేసరి’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో శ్రీలీలకు సూచనలిస్తూ సన్నివేశానికి రెడీ అవుతున్న సమయంలో బ్రహ్మాజీ వెళ్లి తన కొడుకు సినిమా రిలీజ్ డేట్ గురించి చెప్పాలని అనిల్‌ను అడిగాడు.

అవును.. దర్శకుడు అనిల్ రావిపూడి మెడపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ కత్తి పెట్టారు. తాను చెప్పిన పని చేయాల్సిందే అని బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐతే అనిల్, బ్రహ్మాజీ ఇద్దరూ కూడా సరదా మనుషులని అందరికీ తెలుసు. వారి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్లలో భాగంగా ఈ వెరైటీ వీడియో చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...