ఆ వివరాల్లోకి వెళితే.. జూలై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో రూపొందిన ‘బ్రో’ తెరపైకి వచ్చింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ.. రూ. 30 కోట్లకి పైగా నష్టంతో డిజాస్టర్ గా నిలిచింది. దాన్ని మరిచిపోయేలోపే.. ఆగస్టు 11న ‘భోళా శంకర్’గా పలకరించారు చిరు. ఔట్ డేటెడ్ కంటెంట్ తో బోల్తా పడ్డ ఈ సినిమా కారణంగా.. రూ. 53.5 కోట్లకి పైగా భారీ నష్టం వచ్చిందన్నది ట్రేడ్ మాట. కట్ చేస్తే.. భోళా చేసిన గాయాన్ని మరిచిపోయేలోపే ఆగస్టు 25న ‘గాండీవధారి అర్జున’గా జనం ముందుకొచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆద్యంతం ఏ మాత్రం ఆకట్టుకోని సినిమా ఇదంటూ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరిచేశారు. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ తో బాక్సాఫీస్ ముంగిట నిలిచిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. రూ. 16.5 కోట్ల నష్టం చూసింది. ఏదేమైనా.. నెలలోపు మూడు డిజాస్టర్స్ తో, అక్షరాలా రూ. 100 కోట్ల నష్టంతో మెగా కాంపౌండ్ మరోసారి వార్తల్లో నిలిచింది. మొత్తమ్మీద.. హిట్స్ తోనే కాదు డిజాస్టర్స్ తోనూ మెగా క్యాంప్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోందటున్నారు నెటిజన్స్.