అకీరా వచ్చాడు.. సందళ్లు తెచ్చాడు

Date:


సినిమా నడుస్తున్నంతసేపూ అందరి చూపూ అకీరా మీదే ఉంది. తండ్రిని మించి పొడవుగా ఎదిగిపోయిన అకీరా.. హీరోగా బాగా క్లిక్ అవుతాడనే అందరూ అంచనా వేస్తున్నారు. అతను కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడనే అంచనాతోనే ఉన్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చదువుకుంటూనే నటనలో అకీరా శిక్షణ తీసుకుంటూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక మూణ్నాలుగేళ్లలో అకీరా తెరంగేట్రం గురించి వార్త బయటికి వస్తుందనే అంచనాతో ఉన్నారు.

అకీరా వచ్చాడని తెలియగానే థియేటర్ దగ్గర మామూలు హడావుడి లేదు. ఒక స్టార్ హీరో వచ్చినంత హంగామా చేశారు అభిమానులు. పవన్, అకీరాల పేర్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ఫ్యూచర్ పవర్ స్టార్ అంటూ అకీరా గురించి నినాదాలు చేశారు ఫ్యాన్స్. అభిమానులను దాటుకుని థియేటర్లోకి వెళ్లడానికి అకీరా చాలానే కష్టపడాల్సి వచ్చింది.

తన ఫొటోలు ఏవైనా బయటికి వస్తే చాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. తనకు హీరో ఎలివేషన్లు ఇచ్చేస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిది పవన్ సినిమా విడుదల సందర్భంగా అకీరా థియేటర్లలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? శుక్రవారం అదే జరిగింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో అకీరా ‘బ్రో’ సినిమా చూశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఇప్పటిదాకా సినిమాలతో తనకేమీ టచ్ లేదన్నట్లే ఉంటున్నాడు. అసలతను చాలా ఏళ్ల నుంచి తల్లితో కలిసి పుణెలోనే ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎయిర్‌పోర్ట్‌ల్లో మీడియా కళ్లలో పడటమే తప్ప అతను ఏమాత్రం లైమ్ లైట్‌కు దగ్గర్లో లేడు. కానీ పవన్ తనయుడిని హీరోగా చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. అకీరా పేరు ఎత్తితే చాలు పవన్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...