కేంద్ర అధికార పార్టీ బిజెపి వేస్తున్న రాజకీయ అడుగులు ఎవరికి అర్థం కావడం లేదు.కేంద్రంలో కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామన్న ధీమా బిజెపి అగ్ర నేతల్లో కనిపిస్తోంది.
అయినా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నారు.లోక్ సభ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన నేపథ్యంలో, పాత మిత్రులందరినీ ఏకం చేసి తమకు అనుకూలంగా మార్చుకునే పనుల్లో నిమగ్నమైంది .ఈ మేరకు ఎన్ డి ఏ కూటమిలో గతంలో కీలకంగా వ్యవహరించిన వారు , ప్రస్తుతం బిజెపికి అనుకూలంగా ఉన్నవారు, పొత్తు పెట్టుకున్న పార్టీ నేతలను ఢిల్లీకి పిలిచారు.అయితే ఈ పిలుపు వెనక కారణం ఏమిటనేది ఎవరికి తెలియకపోయినా, పిలవడమే గొప్ప అన్నట్లుగా కొన్ని పార్టీల అధినేతలు ఉన్నారు.
ఎన్డీఏ నిర్వహించబోతున్న సమావేశంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కు ఇప్పటికే పిలుపు ఆందగా, గతంలో ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం బిజెపికి దూరంగా ఉంటూ , పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం గా మారింది.

ఎప్పటి నుంచో బీజేపీకి అనుకూలంగా చంద్రబాబు( Chandrababu Naidu ) స్టేట్మెంట్లు ఇస్తున్న , కేంద్ర బిజెపి పెద్దలను సందర్భం వచ్చినప్పుడల్లా పొగడ్తలతో ముంచేత్తుతున్నా, ప్రస్తుతం నిర్వహించబోయే మీటింగ్ కు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ టెన్షన్ పడుతోంది.ఏపీలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమై, పెద్దగా ఓటు బ్యాంకు లేని జనసేన పార్టీని ఈ సమావేశానికి పిలిచి టీడీపీ వంటి బలమైన పార్టీని పీలవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.జనసేన పార్టీని ఆహ్వానించి బలమైన పార్టీగా ఉన్న టిడిపిని పిలవకపోవడం ఏంటయ్యా అనే చర్చ ఆ పార్టీ కీలక నాయకుల మధ్య జరుగుతోంది.టిడిపి తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదు అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏపీలో బలమైన టిడిపిని వదిలేసి జనసేన ను మాత్రమే పిలవడంతో, రాబోయే ఎన్నికల సమయంలో పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చర్చనీయాంశం గా మారింది.

అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు( TDP PARTY ) పెట్టుకునేందుకు బిజెపి అగ్ర నేతలు ఎవరు ఇష్టపడడం లేదని, అందుకే చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు విరమించుకునే విధంగా ఎన్డీఏ సమావేశానికి పిలవలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో వైసిపి , టిడిపి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎక్కువ ఎంపీ సీట్లు ఏ పార్టీ గెలుచుకున్నా, తమను కాదని ముందుకు వెళ్లే పరిస్థితి లేదనే అభిప్రాయంతోనే బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లుగా టిడిపి నేతలు అనుమానిస్తున్నారు.
